close

సోమవారం, జనవరి 20, 2020

తాజా వార్తలు

గాంధీజీ సిద్ధాంతాలే యువతకు దిక్సూచి

వికారాబాద్‌లో గాంధీ సంకల్పయాత్రలో పాల్గొన్న భాజపా నాయకులు, స్థానికులు

వికారాబాద్‌టౌన్‌, న్యూస్‌టుడే: గాంధీజీ సిద్ధాంతాలను యువత ఆదర్శంగా తీసుకోవాలని భాజపా రాష్ట్ర కార్యదర్శి బెక్కరి జనార్దన్‌రెడ్డి అన్నారు. గాంధీ 150వ జయంతిని పురస్కరించుకొని గురువారం వికారాబాద్‌ పట్టణంలో భాజపా ఆధ్వర్యంలో గాంధీ సంకల్పయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చేవెళ్ల పార్లమెంట్‌ పరిధిలో గాంధీ సంకల్పయాత్ర 150 కిలోమీటర్లు సాగుతుందని, ఈ క్రమంలో నాలుగో రోజున వికారాబాద్‌ మున్సిపల్‌ పరిధిలోని ఎంఐజీ, ఆలంపల్లి వరకు పాదయాత్ర నిర్వహించామన్నారు. గాంధీజీ అహింస, సత్యాగ్రహం నినాదాలే దేశం నుంచి బ్రిటిష్‌ పాలకులను వెళ్లగొట్టేలా చేశాయన్నారు. స్వాతంత్య్రం అనంతరం దేశంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం గాంధీజీ ఆలోచనలు అమలు చేయలేకపోయిందని విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ గాంధీ ఆశయాలను అమలుచేస్తున్నారని, అందులో భాగంగా స్వచ్ఛభారత్‌, ఉజ్వల యోజన, ఆయుష్మాన్‌ భారత్‌, కిసాన్‌సమ్మాన్‌ యోజన వంటి పథకాలు తీసుకొచ్చి అమలు చేస్తున్నారన్నారు. భాజపా పాలనలో దేశాభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం మరింత పెంచే ప్రయత్నం జరుగుతోందన్నారు. ప్రతిఒక్కరూ ప్లాస్టిక్‌ వినియోగం తగ్గించి ప్రకృతిని కాపాడుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్‌ భారత్‌ను రాష్ట్రంలో తెరాస ప్రభుత్వం అమలుచేయకుండా పేదలకు అన్యాయం చేస్తోందన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో భాజపా జెండా ఎగురవేస్తామన్న విశ్వాసం ఉందన్నారు. కార్యక్రమంలో భాజపా జిల్లా అధ్యక్షుడు ప్రహ్లాద్‌రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శివరాజ్‌, మాధవరెడ్డి, పాండుగౌడ్‌, కేపీరాజు, విజయభాస్కర్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, శ్రీకాంత్‌, పోకల సతీష్‌, వివేకానందారెడ్డి, నరోత్తంరెడ్డి, విజయ్‌రాజ్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.