close

సోమవారం, జనవరి 27, 2020

తాజా వార్తలు

భూసార పరిరక్షణతోనే సుస్థిర దిగుబడులు

ఎమ్మెల్యే వనమా

వ్యవసాయ యాంత్రీకరణ వస్తువులను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే వనమా

కొత్తగూడెం వ్యవసాయం, న్యూస్‌టుడే: భూమి తల్లిని సంరక్షించుకొంటేనే సుస్థిర దిగుబడులను సాధించవచ్చని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరావు అన్నారు. కొత్తగూడెంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన ‘ప్రపంచ మృత్తికా దినోత్సవం’లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. కాలుష్య ప్రభావంతో ఇప్పటికే వాతావరణంలో పర్యావరణ సమతుల్యత దెబ్బతిన్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. ఫలితంగా రుతుపవనాల్లో మార్పు ఏర్పడుతోందన్నారు. సహజ వనరైన భూమిని కాపాడుకోవడం అందరి బాధ్యతగా పేర్కొన్నారు. రైతులకు సాగులో సలహాలు, సూచనలు అందించేందుకు ‘కృషి విజ్ఞాన కేంద్రం’ కృషిచేస్తుందన్నారు. వరంగల్‌ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం సహాయ సంచాలకుడు డాక్టర్‌ పి.జగన్‌మోహన్‌రావు మాట్లాడుతూ భూసార పరీక్షల ఫలితాల ఆధారంగానే రైతులు ఎరువుల యాజమాన్యాన్ని చేపట్టాలన్నారు. ‘మృత్తికా క్షయం’ నివారణకు చేపట్టాల్సిన కాంటూరు సేద్యం, వాలుకు అడ్డంగా సాగు, సేంద్రియ ఎరువుల వాడకం, పంట మార్పిడి, అంతర పంటల సాగు వంటి వాటివి దోహదపడతాయన్నారు. భూసార పరిరక్షణ, పంటల్లో ఎరువుల యాజమాన్యం గురించి కేవీకే సమన్వయకర్త డా.జి.వీరన్న అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వ్యవసాయ యాంత్రీకరణ ప్రదర్శనను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి అభిమన్యుడు, ఉదాన్యశాఖాధికారి మరియన్న, జడ్పీ ఉపాధ్యక్షుడు కంచర్ల చంద్రశేఖర్‌రావు, చుంచుపల్లి ఎంపీపీ బాదావత్‌ శాంతి, సర్పంచి మోతీ, ఎంపీటీసీ బోడా శారద, మాధవరావు, శాస్త్రవేత్తలు మాలతీ, రాంప్రసాద్‌, విశ్వతేజ, శివ రైతులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.