close

సోమవారం, జనవరి 27, 2020

తాజా వార్తలు

అర్హులకే రెండు పడక గదుల ఇళ్లు మంజూరు చేయాలి: కలెక్టర్‌
తహసీల్దార్ల సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ శైనీ, పక్కన జేసీ వెంకటేశ్వర్లు, ప్రత్యేకాధికారి ఇలా త్రిపాఠి

కొత్తగూడెం కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: అర్హత ఉన్నవారికి మాత్రమే రెండు పడకల గదుల ఇళ్లు మంజూరు చేయాలని కలెక్టర్‌ రజత్‌ కుమార్‌ శైనీ తహసీల్దార్లను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన తహసీల్దార్ల సమావేశంలో ఆయన కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌, ఆహార భద్రత కార్డులు, భూ రికార్డుల శుద్ధీకరణ, మీ సేవా కేంద్రాల నిర్వహణ, జన గణన అంశాలపై సమీక్ష జరిపారు. రెండు పడకల గదుల ఇళ్లు మంజూరులో ప్రభుత్వ మార్గదర్శకాలను తూ.చ. తప్పకుండా పాటించాలన్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించి దరఖాస్తుదారుల పరిస్థితులను తెలుసుకోవాలన్నారు. అనంతరం గ్రామసభ ద్వారా నిజమైన లబ్ధిదారుల జాబితాను రూపొందించాలన్నారు. కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాల దరఖాస్తుదారుల వివరాలను పరిశీలించాకే జాబితాను నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు పంపించాలన్నారు. ఆన్‌లైన్‌లో పొందుపరిచిన ఆహార భద్రత కార్డులపై తహసీల్దార్లు విచారణ చేపట్టి.. ఆ వివరాలను డీఎస్‌ఓకు సిఫార్సు చేయాలన్నారు. అటవీ, రెవెన్యూ భూములకు సంబంధించి రికార్డుల పరిశీలనకు సంయుక్త విచారణ చేపట్టాలన్నారు. ‘గూగుల్‌ ఎర్త్‌’ సాంకేతికతతో ఓటరు వివరాల వివరాల ఆన్‌లైన్‌ ప్రక్రియను ఈనెల 20వ తేదీ నాటికి పూర్తిచేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఎంపీడీఓల ఇండెంట్‌ ఆధారంగా మాత్రమే శ్మశాన వాటికలు, ఇంకుడు గుంతల నిర్మాణానికి ఇసుక సరఫరా చేయాలని, దీన్ని విధిగా పర్యవేక్షించాలని ఆయన తహసీల్దార్లకు సూచించారు. ప్రజావసరాలకు మండలాల క్వారీలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటే ప్రతిపాదనలు పంపాలన్నారు. నివేదన యాప్‌ సమస్యల పట్ల కిందిస్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారి వరకు తక్షణం స్పందించాలన్నారు. ‘2020’ జనాభా లెక్కలకు సంబంధించి ఎన్యూమరేటర్లను నియమించాలని శైనీ ఆదేశించారు. గణనకు సంబంధించిన మాస్టర్‌ ట్రైనర్లు హైదరాబాద్‌లో శిక్షణ తీసుకుంటున్నారని, వచ్చే వారంలో జిల్లాలోని సిబ్బందికి వారు అవగాహన కల్పిస్తారన్నారు. జేసీ కె.వెంకటేశ్వర్లు, జిల్లా ప్రత్యేక అధికారి ఇలా త్రిపాఠి, డీఆర్వో లక్ష్మణస్వామి, ఆర్డీవో స్వర్ణలత పాల్గొన్నారు.

సమావేశంలో పాల్గొన్న వివిధ మండలాల తహసీల్దార్లు

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.