close

ఆదివారం, జనవరి 26, 2020

తాజా వార్తలు

డయల్‌ 100కు విశేష స్పందన: సీపీ

గోదావరిఖని, న్యూస్‌టుడే: శాంతిభద్రతల సమస్యలపై సత్వర ఫిర్యాదు కోసం ఏర్పాటు చేసిన డయల్‌ 100కు పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో విశేష స్పందన లభించినట్లు రామగుండం పోలీసు కమిషనర్‌ వి.సత్యనారాయణ తెలిపారు. తగాదాలు, రహదారి ప్రమాదాలు, అసాంఘిక కార్యకలాపాలు, వేధింపులు తదితర సంఘటనల్లో ప్రజలు వెంటనే 100కు డయల్‌ చేసి ఫిర్యాదు చేస్తున్నారన్నారు. పోలీసులు వెంటనే స్పందించి సత్వర చర్యలు తీసుకుంటున్నట్లుగా ఆయన వివరించారు. నవంబరులో ‘డయల్‌ 100’కు 4,182 ఫిర్యాదులు రాగా ఆయా పోలీసుస్టేషన్ల పరిధిలో 67 ఎఫ్‌.ఐ.ఆర్‌.లు నమోదు చేసినట్లుగా సీపీ పేర్కొన్నారు. శారీరక నేరాలకు సంబంధించి 502, స్త్రీలపై జరిగిన నేరాలకు సంబంధించి 485, రోడ్డు, ఇతర ప్రమాదాలకు సంబంధించి 469, స్థిర, చర ఆస్తులకు సంబంధించి 91, ఆత్మహత్యలు, ఆత్మహత్యాయత్నాలకు సంబంధించి 136, ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న సంఘటనల్లో 06, ఇతర సంఘటనల్లో 2,493 ఫిర్యాదులు వచ్చినట్లు ఆయన వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో పోలీసుల సహాయం కోసం షీటీమ్‌ నెంబరు 63039, 23700 నెంబరుతో పాటు 100, 1098, 112 నెంబరుకు డయల్‌ చేయాలని ఆయన కోరారు. మహిళల భద్రతే లక్ష్యంగా పోలీసులు నిరంతరాయంగా పని చేస్తున్నారని, ఆపదలో ఉన్నప్పుడు ప్రతి మహిళకు పోలీసులే గుర్తుకు రావాలని, నిర్ణీత నెంబర్లకు వెంటనే డయల్‌ చేసి ఫిర్యాదు చేస్తే సత్వరమే తగిన సహాయం అందిస్తారని కమిషనర్‌ వివరించారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.