close

ఆదివారం, జనవరి 26, 2020

తాజా వార్తలు

వివేకానంద గ్రంథాలయం ఏర్పాటు

గ్రంథాలయంలో పూజ చేస్తున్న గ్రామ కమిటీ ప్రతినిధులు

బోర్గాం(పి)(మోపాల్‌), న్యూస్‌టుడే: నగర శివారులోని బోర్గాం(పి) గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ, యువకుల ఆధ్వర్యంలో వివేకానంద గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. శుక్రవారం గ్రంథాలయాన్ని ప్రారంభించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల పక్కనే వృథాగా ఉన్న నాలుగు గదులను గ్రంథాలయం కోసం కేటాయించామన్నారు. ఈ గదులకు మరమ్మతులు చేయించి రంగులు వేసి పుస్తకాలు, ఫర్నీచర్‌ను సైతం సమకూర్చామన్నారు. గ్రామ కమిటీతోపాటు యువకులు, దాతలు విరాళాలు అందజేశారని చెప్పారు. ఈ గ్రంథాలయంలో దిన పత్రికలతో పాటు పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు అవసరమయ్యే అన్ని రకాల పుస్తకాలను అందుబాటులో ఉంచుతున్నామన్నారు. నిర్వహణకు ప్రత్యేక కమిటీని సైతం ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ ప్రతినిధులు రమేశ్‌రెడ్డి, విక్రమ్‌రెడ్డి, నారాయణ, శ్రీనివాస్‌రెడ్డి, యువజన సంఘం ప్రతినిధులు శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.