close

గురువారం, జనవరి 23, 2020

తాజా వార్తలు

ప్లాస్టిక్‌ రహిత సమాజమే లక్ష్యం

నార్సింగ్‌,  హైదరాబాద్‌ : ప్లాస్టిక్‌రహిత సమాజమే లక్ష్యంగా అందరూ కృషి చేయాలని బాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు అన్నారు. శనివారం గండిపేట జలమండలి పార్కు వద్ద గండిపేట్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన 4కె రన్‌ను పీవీ సింధు ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడటానికి ప్రతి ఒక్కరు  కృషి చేయాలన్నారు. యువతులు, బాలికలు ఆత్మ రక్షణ కోసం కరాటే వంటి మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్చుకోవాలని, దీని ద్వారా ‘దిశ’ వంటి సంఘటనలను ఎదుర్కోవడం సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రాజేందర్‌ నగర్‌ ఎమ్మెల్యే ప్రసాద్‌ గౌడ్‌, రాష్ట్ర మున్సిపల్‌ పరిపాలనా పట్టణాభివృద్ధి శాఖ సంచాలకుడు డాక్టర్‌ టీకే శ్రీదేవి, స్థానిక మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.