close

ఆదివారం, జనవరి 26, 2020

తాజా వార్తలు

అడవులను ప్రజలకు చేరువ చేయాలి


లక్కారంలోని తంగేడువనంలో శిక్షణ అటవీ అధికారులతో మాట్లాడుతున్న

జిల్లా అటవీశాఖాధికారి వెంకటేశ్వర్‌రెడ్డి

చౌటుప్పల్‌, న్యూస్‌టుడే: అడవికి, ప్రజలకు మధ్యన అనుబంధాన్ని పెంచడానికి అటవీ సిబ్బంది సమష్టి కృషి చేస్తున్నామని జిల్లా అటవీశాఖాధికారి వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు. మేడ్చల్‌ జిల్లా దూలపల్లిలోని తెలంగాణ రాష్ట్ర అటవీ అకాడమీలో శిక్షణ పొందుతున్న 42 మంది అటవీ సెక్షన్‌ అధికారుల బృందం లక్కారంలోని తంగేడువనాన్ని శనివారం సందర్శించారు. ఆ వనంలో జపాన్‌ శాస్త్రవేత్త మియావాకీ అమలు చేసిన పద్ధతిలో ఇక్కడ పెంచుతున్న యాదాద్రి నమూనా ప్రకృతి పార్కును, సీతాకోకచిలుక, తంగేడు, వెదురు, రాశి వనాలను వారు పరిశీలించారు. శిక్షణ అధికారులను జిల్లా అటవీశాఖాధికారి వెంకటేశ్వర్‌రెడ్డి స్వాగతించారు. జిల్లాలో కేవలం నాలుగు శాతం మాత్రమే అడవి ఉన్నందున మియావాకీ పద్ధతిలో జిల్లా అంతటా దట్టమైన అడవులను సృష్టించడానికి ప్రయోగాత్మకంగా లక్కారంలో శ్రీకారం చుట్టామని వివరించారు.

రూ.85లక్షలతో అభివృద్ధి పనులు: తంగేడువనంలో అభివృద్ధి పనులకు రూ.85 లక్షలు రూర్బన్‌ నిధులు కేటాయించినట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి మందడి ఉపేందర్‌రెడ్డి తెలిపారు. జిల్లా అటవీశాఖాధికారి డి.వెంకటేశ్వర్‌రెడ్డితో కలిసి ఆయన చౌటుప్పల్‌లోని అటవీ క్షేత్రాధికారి కార్యాలయంలో శనివారం విలేకరులతో మాట్లాడారు. లక్కారంలోని తంగేడువనంలో జాతీయ రహదారి పక్కన కెఫెటేరియా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో దీన్ని నిర్వహిస్తామని చెప్పారు. ఇందులో పూర్తిగా సేంద్రియ పదార్థాలతో వండిన ఆహారం లభిస్తుందని వివరించారు. ప్రకృతిని వీక్షించేందుకు రూ.20 లక్షలతో వ్యూ పాయింట్‌ నిర్మాణం చేయిస్తామన్నారు. రూ.25లక్షలతో ప్రజలకు పర్యావరణంపై అవగాహన కల్గించేందుకు కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. మరో రూ.20 లక్షలతో రేపటి తరమైన పిల్లలకు అడవి గురించి, పర్యావరణం గురించి స్వీయ అవగాహన పెంచుకునేలా ఎంట్రీ థీమ్‌ ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. అటవీ క్షేత్రాధికారులు సర్వేశ్వర్‌, శ్రీనివాస్‌, వెంకట్రాములు, రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.