close

మంగళవారం, జనవరి 28, 2020

తాజా వార్తలు

ముగిసిన అభ్యంతరాల స్వీకరణ

వచ్చినవి 20 విజ్ఞాపనలు

పెద్దపల్లి, న్యూస్‌టుడే: వార్డుల పునర్విభజనపై అభ్యంతరాల స్వీకరణకు సోమవారం చివరి రోజు కావడంతో వివిధ వార్డుల నుంచి 12 విజ్ఞాపన పత్రాలు వచ్చాయి. వీటితో అభ్యంతరాలపై వచ్చిన ఫిర్యాదుల సంఖ్య 20కి పెరిగింది. ఒక వార్డు నుంచి మరో వార్డుకు ఇంటినంబర్లు మారడం, ఒకే వీధిలో జరిగిన వార్డుల విభజనకు అనుసరించిన విధానాలు, ఒకే కుటుంబం, ఒకే సామాజిక వర్గానికి చెందిన ఓట్లు వార్డుల విభజనతో చీలిపోవడం తదితర అంశాలపై ఎక్కువగా అభ్యంతరాలు వచ్చాయి. ఒక్క సుభాష్‌నగర్‌ను 15, 16 వార్డులుగా విభజించి వేర్వేరు ప్రాంతాలను కలిపేయడంపై 9 అభ్యంతరాలు వచ్చాయి. 6, 7 వార్డుల పరిధిలోని క్రిస్టియన్‌ కాలనీ, హన్‌మాన్‌నగర్‌, ప్రగతినగర్‌ ప్రాంతాలను విభజించడంపై 3 అభ్యంతరాలు వచ్చాయి. ఇవే కాకుండా 10, 20, 31, 19, 4, 25, 32 వార్డుల నుంచి ఒక్కోక్కటి, 27, 28 వార్డుల నుంచి మరో విజ్ఞాపన వచ్చింది.

పెద్దపల్లి మునిసిపాలిటీలో విలీనమైన చందపల్లి, బంధంపల్లి గ్రామాల నుంచి ఎలాంటి వినతి పత్రాలు రాలేదు. బంధంపల్లిని ఒకే వార్డు పరిధిలోకి తీసుకురాగా, చందపల్లిని మూడు వార్డులుగా విభజించారు. మరో విలీన గ్రామమైన రంగంపల్లిలోని పలు ప్రాంతాలను పెద్దపల్లి పట్టణపరిధిలోని వార్డులో కలపడంపై రంగంపల్లి గ్రామస్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. రంగంపల్లి పరిధిలోని ఆదర్శనగర్‌ను 16వ వార్డులో కలపడంపై గ్రామానికి చెందిన పలువురు అభ్యంతరం తెలిపారు. 19వ వార్డుపరిధిలో పాత గ్రామం, గణేష్‌నగర్‌, శివాజీనగర్‌, విష్ణుపురికాలనీ, ఆదర్శనగర్‌ ఉన్నాయి. ఆదర్శనగర్‌లోని కొంతభాగాన్ని కాపువాడ, రాజీవ్‌రోడ్డు, సుభాష్‌నగర్‌, వైఎస్‌ఆర్‌నగర్‌లో కలపడంపై అభ్యంతరం వ్యక్తమైంది. రంగంపల్లికి చెందిన 18వ వార్డులో పెద్దబొంకూర్‌, 19వ వార్డులో పెద్దకల్వలలోని కొన్ని నివాస గృహాలు కలిపేయడంతో ఈ రెండు వార్డులు మొత్తం మునిసిపాలిటీలోనే విశాలమైన వార్డులగామారిపోయాయి.

తుది జాబితాపై కసరత్తు
వార్డు విభజనపై అభ్యంతరాల స్వీకరణ పూర్తికావడంతో తుదిజాబితాకు అధికారులు కసరత్తులు చేస్తున్నారు. గత నాలుగురోజులుగా వచ్చిన అభ్యంతరాలపై విచారణ నిర్వహించిన అధికారులు అవసరమయ్యే సవరణలు చేపడుతున్నారు. దీని కోసం తుది కసరత్తులు ఇప్పటికే చేపట్టిన అధికారులు మరోసారి క్షేత్రస్థాయిలో పర్యటించి, తుది జాబితాను ఖరారు చేయనున్నారు. ఈనెల 17న వార్డు విభజన తుదిజాబితాను ప్రచురించేందుకు అధికారులు ముమ్మర కసరత్తులు చేపట్టారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.