close

సోమవారం, జనవరి 20, 2020

తాజా వార్తలు

భార్యతో గొడవపడి బలవన్మరణ యత్నం

వ్యక్తి ప్రాణాలు కాపాడిన డయల్‌ 100

ఖమ్మం రోటరీనగర్‌, న్యూస్‌టుడే: ఖమ్మం నగరంలో డయల్‌ 100 ఒకరి ప్రాణాలను కాపాడింది. క్షణికావేశంలో ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్న వ్యక్తి సమాచారాన్ని కుటుంబ సభ్యులు అందించడంతో తక్షణమే స్పందించిన పోలీసు సిబ్బంది అతని బలవన్మరణ ప్రయత్నాన్ని సకాలంలో అడ్డుకోగలిగారు. నగర పోలీసులు మంగళవారం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి... నగరంలోని బొక్కలగడ్డ ప్రాంతానికి చెందిన కొత్తపల్లి మల్లయ్య, అతని భార్యకు సోమవారం రాత్రి 10గంటల సమయంలో గొడవ జరిగింది. దీంతో బయటకు వెళ్లిన మల్లయ్య రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంటున్నానని భార్యకు ఫోన్‌ చేసి కట్‌ చేశాడు. వెంటనే అప్రమత్తమైన ఆమె డయల్‌ 100కు సమాచారం ఇచ్చింది. సమాచారం అందుకున్న మూడో పట్టణ సీఐ శ్రీధర్‌ తక్షణమే స్పందించారు. మల్లయ్య ఉన్న ప్రాంతాన్ని గుర్తించి సారథినగర్‌ రైల్వే లైను వైపు ఉన్న బ్లూకోల్ట్స్‌ సిబ్బందిని అప్రమత్తం చేశారు. కానిస్టేబుల్‌ పాషా లొకేషన్‌ మ్యాపింగ్‌ ద్వారా రైలు పట్టాల వద్దకు చేరుకుని మల్లయ్యను అదుపులోకి తీసుకున్నారు. సిబ్బంది చేరడం మరో నిమిషం ఆలస్యమైనా అతను దక్కి ఉండేవాడు కాదని పోలీసులు తెలిపారు. అనంతరం అతనికి కౌన్సెలింగ్‌ నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ సందర్భంగా పోలీసు కమిషనర్‌ తఫ్సీర్‌ ఇక్బాల్‌, అదనపు డీసీపీ మురళీధర్‌, ఏసీపీ గణేశ్‌, సీఐ శ్రీధర్‌ సిబ్బందిని అభినందించారు.


రైలు ఢీకొని వృద్ధుడి మృతి

చింతకాని, న్యూస్‌టుడే: ప్రమాదవశాత్తు రైలు ఢీకొని నాగులవంచకు చెందిన పడిశాల భద్రయ్య(75) మృతి చెందిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. భద్రయ్య నాగులవంచ నుంచి పాతర్లపాడు వెళ్తూ పట్టాలు దాటుతున్న సమయంలో ప్రమాదవశాత్తు రైలు ఢీకొంది. ఈ సంఘటనలో భద్రయ్య అక్కడికక్కడే మృతి చెందారు. రైల్వే ఎస్సై రవికుమార్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


బ్యాంకు ఖాతా నుంచి నగదు మాయం

ఖమ్మం రోటరీనగర్‌, న్యూస్‌టుడే: బ్యాంకు ఖాతా నుంచి నగదు మాయమైన సంఘటనపై ఖమ్మం రెండో పట్టణ పోలీసుస్టేషన్‌లో మంగళవారం కేసు నమోదు అయ్యింది. సీఐ గోపి కథనం ప్రకారం... సారథినగర్‌లో నివసించే తాళ్లూరి ఉదయభాస్కర్‌ ఖమ్మం నగరంలోని ఏక్సిస్‌ బ్యాంకు మేనేజరుగా పనిచేస్తున్నారు. ఆయన బ్యాంకు ఖాతా నుంచి గత సెప్టెంబరు 15న తొలుత ఒక రూపాయి జమ అయ్యి, తిరిగి డ్రా అయ్యింది. అదేరోజున పలు దఫాలుగా మొత్తం రూ.19,187 నగదు డ్రా చేశారు. ఆలస్యంగా గుర్తించిన ఉదయ్‌భాస్కర్‌ అందించిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు సీఐ వివరించారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.