close

సోమవారం, జనవరి 27, 2020

తాజా వార్తలు

ఆర్టీసీ బస్సును ఢీకొన్న డీసీఎం

ఇద్దరికి తీవ్రగాయాలు

వాహనంలో ఇరుక్కుపోయిన క్షతగాత్రుడు

రాయపర్తి, న్యూస్‌టుడే: వరంగల్‌ రూరల్‌ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి డీసీఎం ఆర్టీసీ బస్సును వెనుక నుంచి ఢీకొనగా ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వరంగల్‌కు వస్తుండగా జరిగిన ఈ ఘటనలో అక్కంపేటకు చెందిన డ్రైవర్‌ పెండ్లి రాజుకు తీవ్రగాయాలయ్యాయి. ఖిలావరంగల్‌కు చేందిన సురేష్‌ వాహనంలో ఇరుక్కొని నరకయాతన అనుభవించాడు. వీరిని మెరుగైన చికిత్స కోసం హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. బస్సులో ఉన్న ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనపై ‘న్యూస్‌టుడే’ పోలీసులను వివరణ కోరగా తమకు ఫిర్యాదు అందలేదన్నారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.