close

సోమవారం, జనవరి 20, 2020

తాజా వార్తలు

ప్రతిభకుకితాబు

అట్టహాసంగా కళా ఉత్సవ్‌ పోటీలు 


విజేతకు జ్ఞాపికను అందిస్తున్న ఉప విద్యాశాఖాధికారిణి సుభద్ర

కాకినాడ నగరం, న్యూస్‌టుడే: : విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీసేందుకు కళా ఉత్సవ్‌ పోటీలు ఎంతగానో దోహదపడతాయని సమగ్ర శిక్ష ఏపీసీ విజయభాస్కర్‌ తెలిపారు. జగన్నాథపురంలోని ఎంఎస్‌ఎన్‌ ఛార్టీస్‌ ఎయిడెడ్‌ పాఠశాల ఆవరణలో మంగళవారం నిర్వహించిన జిల్లాస్థాయి పోటీలను ఉప విద్యాశాఖాధికారిణి డి.సుభద్ర, అర్బన్‌ డీఐ వాణీకుమారితో కలిసి ఏపీసీ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థిలోనూ ఏదో ఒక అంశంలో నైపుణ్యం ఉంటుందని, దానిని గుర్తించి వెలికితీయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. పోటీల నోడల్‌ అధికారిణి సుభద్ర మాట్లాడుతూ కళల ప్రదర్శన ద్వారా విద్యార్థుల్లో ఒత్తిడిని తగ్గించవచ్చన్నారు.జాతీయ బాలల సైన్స్‌ కాంగ్రెస్‌ జిల్లా సమన్వయకర్త కేసరి శ్రీనివాసరావు మాట్లాడుతూ పోటీలకు 36 పాఠశాలలు, 8 కళాశాలల నుంచి 121 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. జిల్లాస్థాయి విజేతలంతా ఈనెల 17, 18వ తేదీల్లో విజయవాడలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. అనంతరం పోటీల్లో ప్రతిభకనబరిచిన వారికి జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలను అందజేశారు. సమగ్ర శిక్ష ప్రణాళిక విభాగం సమన్వయకర్త సలాది సుధాకర్‌, జిల్లా సైన్స్‌ అధికారి జి.వసంతకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

విజేతలు వీరే..

చిత్రలేఖనం: పి.సోహంత్‌, పదో తరగతి, రంప ఎర్రంపాలెం (గోకవరం మండలం), పి.శ్రీవల్లి, తొమ్మిదో తరగతి, కేజీబీవీ, తొండంగి.

నృత్యం: ఎం.ప్రదీప్‌వర్మ, పదో తరగతి, కాజులూరు, ఎం.ఈశ్వరి, ఇంటర్‌, శ్రీప్రకాష్‌ జూనియర్‌ కళాశాల, పెద్దాపురం

సంగీతం: వి.రాజా వెంకటస్వామి, పదో తరగతి, కాజులూరు, ఎస్‌ఎల్‌ఎస్‌ వైష్ణవి, ఇంటర్‌, ఆదిత్య జూనియర్‌ కళాశాల, కాకినాడ.

వయోలిన్‌తో ఆలాపన

తబలా వాయిస్తున్న బాలుడు


నృత్యం చేస్తున్న విద్యార్థిని

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.