close

శనివారం, జనవరి 18, 2020

తాజా వార్తలు

ఉరేసుకొని మహిళ బలవన్మరణం

డిచ్‌పల్లి, న్యూస్‌టుడే: డిచ్‌పల్లి మండలం సుద్దపల్లి గ్రామానికి చెందిన లింగపురం చిన్నలక్ష్మి(52) అనే మహిళ ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై సురేశ్‌కుమార్‌ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నలక్ష్మి కూతురు గతంలో మరణించడంతో అప్పటి నుంచి తీవ్ర మనస్తాపానికి గురైంది. సోమవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో దూలానికి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.


కిరోసిన్‌ పోసుకుని యువకుడి మృతి

రామారెడ్డి, న్యూస్‌టుడే: కడుపునొప్పి భరించలేక ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం రామారెడ్డి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఎస్సై రాజు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన చింతకుంట కిషన్‌(20) కొద్ది రోజులుగా కడుపునొప్పి రావడంతో ఆసుపత్రుల చుట్టూ తిరిగిన ఫలితం లేకపోవడంతో జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. తండ్రి సాయిలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఎస్సై పేర్కొన్నారు.


రోడ్డు ప్రమాదంలో ఒకరి దుర్మరణం

నడిపల్లి(డిచ్‌పల్లి గ్రామీణం), న్యూస్‌టుడే: నడిపల్లి గ్రామానికి చెందిన కొండ్ర ముత్తన్న(40) అనే వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందినట్లు డిచ్‌పల్లి ఎస్సై సురేష్‌కుమార్‌ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ముత్తన్న ఇంటికి వస్తున్నప్పుడు పాఠశాలకు సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. కుమారుడు దినేష్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

ముగ్గురికి గాయాలు

లింగంపేట: శట్పల్లి చౌరస్తాలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం శట్పల్లి నుంచి ఎల్లారెడ్డికి వెళ్తున్న ద్విచక్రవాహనం, లింగంపేట నుంచి శట్పల్లికి వెళ్తున్న ఆటో పరస్పరం ఢీకొన్నాయి. ద్విచక్రవాహనం పైనున్న లక్ష్మీనారాయణ, సత్తెవ్వ, లక్ష్మవ్వకు గాయాలైయ్యాయి. లక్ష్మవ్వకు కాలు విరగడంతో కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు. ఎల్లారెడ్డిలో కంటి వైద్య శిబిరానికి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు బాధితులు తెలిపారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.