close

ఆదివారం, ఆగస్టు 25, 2019

తాజా వార్తలు

జిల్లా ప్రధాన న్యాయమూర్తిబాధ్యతల స్వీకరణ

ఎ.గిరిధర్‌

కర్నూలు న్యాయవిభాగం, న్యూస్‌టుడే : జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ.గిరిధర్‌ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇదివరకు ఈ స్థానంలో ఉన్న ఎం.వెంకటరమణ నెల రోజుల కిందట హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొంది బదిలీ అవడంతో మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి శ్యాంసుందర్‌ను ఇన్‌ఛార్జి జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు. ఈ క్రమంలో ఖాళీగా ఉన్న ఈ స్థానంలో విజయనగరం జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న ఎ.గిరిధర్‌ను నియమించగా ఆయన సోమవారం కర్నూలులో విధుల్లో చేరారు. ఎస్పీ డాక్టర్‌ కె.ఫక్కీరప్ప జిల్లా ప్రధాన న్యాయమూర్తిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.