close

బుధవారం, ఆగస్టు 21, 2019

తాజా వార్తలు

‘స్మార్ట్‌ ఇండియా హ్యాకథాన్‌’లో వీఎన్‌ఆర్‌ విద్యార్థుల ప్రతిభ

బాచుపల్లి(నిజాంపేట), న్యూస్‌టుడే: ‘వెర్వ్‌-బ్రియో’ పేరుతో చండీగఢ్‌లో స్మార్ట్‌ ఇండియా హ్యాకథాన్‌-2019 అంశంపై నిర్వహించిన కార్యక్రమంలో బాచుపల్లిలోని వీఎన్‌ఆర్‌ విజ్ఞాన్‌జ్యోతి కళాశాల విద్యార్థులు ప్రథమ స్థానంలో నిలిచి రూ.లక్ష పురస్కారం గెలుచుకున్నారని కళాశాల ఒక ప్రకటనలో తెలిపింది. సెంట్రల్‌ సైంటిఫిక్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ ఆర్గనైజేషన్‌(సీఎస్‌ఐఓ) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయిల్‌ ఇండియా లిమిటెడ్‌ సంస్థ చమురు వృథాను అరికట్టడానికి అవసరమైన పరిజ్ఞానాన్ని రూపొందించాల్సిందిగా విద్యార్థులను కోరింది. వీఎన్‌ఆర్‌ కళాశాలకు చెందిన దేవినేని శ్రావణి, వల్లభనేని కావ్య, చందా ఐశ్వర్య, సిరికొండ సాయిభవ్యశ్రీ, రామ వెంకటసాయి, ఆకవరం నిహాష్‌రెడ్డి ఈ సమస్యకు పరిష్కారాన్ని చూపారు. ఇందుకుగాను విద్యార్థుల బృందానికి రూ.లక్ష చెక్కును నిర్వాహకులు అందజేశారు. కార్యక్రమంలో ఈసీఈ విభాగం సహాచార్యులు డి.కాంతిసుధ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.