close

ఆదివారం, ఆగస్టు 25, 2019

తాజా వార్తలు

ఉపాధ్యాయురాలిగా మారిన పాలనాధికారిణి

తడి,పొడి చెత్తపై విద్యార్థినులకు పాఠం

న్యూస్‌టుడే, వికారాబాద్‌ టౌన్‌: విద్యార్థి దశ నుంచే క్రమశిక్షణ అలవరుచుకుని భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని పాలనాధికారిణి అయేషా విద్యార్థినులకు సూచించారు. గురువారం జిల్లా కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలను ఆమె సందర్శించారు. అనంతరం ఉపాధ్యాయురాలిగా మారి 9వ తరగతి విద్యార్థినులకు పాఠం బోధించారు. ఈ సందర్భంగా తడిపొడి చెత్త సేకరణతో కలిగే ...మిగతా 7 లోప్రయోజనాలను వివరించారు. చెత్తను వేర్వేరుగా నిలువ చేసి మున్సిపాల్టీ ఆటోలో వేయాలని సూచించారు. విద్యాలయంలో చదువుతున్న బాలికలను బృందాలుగా ఏర్పాటు చేసి, ఈ విషయమై అవగాహన కల్పించాలన్నారు. చెత్తను ఇషారీతిగా రోడ్లపై పారవేయవద్దని, పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. విద్యార్థినులకు అందుతున్న సౌకర్యాల గురించి తెలుసుకున్నారు. ఆమె వెంట పాఠశాల ప్రిన్సిపల్‌ స్వరూప ఉన్నారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.