close

బుధవారం, ఆగస్టు 21, 2019

తాజా వార్తలు

యువతితో అసభ్య ప్రవర్తన.. యువకుడి అరెస్టు

 

నిందితుడు శివారెడ్డి 

హైదరాబాద్‌ (నేరేడ్‌మెట్‌), న్యూస్‌టుడే: బీటెక్‌ చదివిన యువకుడు రోడ్డుపై ఒంటరిగా వెళ్తున్న యువతితో అసభ్యంగా ప్రవర్తించి పోలీసులకు చిక్కాడు. ఎల్బీనగర్‌ ఠాణా పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలను రాచకొండ సీపీ మహేష్‌భగవత్‌ నేరేడ్‌మెట్‌లోని కమిషనరేట్‌లో శుక్రవారం వెల్లడించారు. సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్‌ మండలం లింగాల గ్రామానికి చెందిన గార్లపాటి శివారెడ్డి అలియాస్‌ శివ (25) కొత్తపేట మారుతినగర్‌లో ఉంటున్నాడు. ఇతను బీటెక్‌ పూర్తిచేశాడు. ఈనెల 12న ఉదయం 10.30 గంటలకు ఎల్బీనగర్‌ ఎస్‌బీహెచ్‌ కాలనీలో ఓ యువతి (19) నడుచుకుంటూ వెళ్తుండగా శివ ముఖానికి ముసుగు వేసుకొని ద్విచక్ర వాహనంపై వెళ్తూ యువతిని వెనుక నుంచి చేతులతో తడిమి అసభ్యకరంగా ప్రవర్తించి పరారయ్యాడు. ఇది చూసిన కాలనీకి చెందిన న్యాయవాది సమారిటన్‌ రవి సందీప్‌ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంతేకాకుండా ఆ ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజీని సీపీ మహేష్‌భగవత్‌కు పంపాడు. స్పందించిన ఆయన ఎస్‌వోటీ పోలీసుల్ని అప్రమత్తం చేశారు. దీంతో పోలీసులు.. శివారెడ్డి నడిపిన వాహనం నెంబరు సక్రమంగా లేకపోవడంతో లోతుగా దర్యాప్తు చేసి వాహనం నెంబరు కనుక్కున్నారు. దాని ఆధారంగా సూర్యాపేట జిల్లా కోదాడలో ఉన్న చిరునామాకు వెళ్లి వాకబు చేయగా అక్కడ ఎవరూ లేరని తేలింది. ఆ వాహనానికి ఫైనాన్స్‌ ఇచ్చిన కంపెనీ ఎస్సార్‌నగర్‌లో ఉన్నట్లు తెలుసుకుని వెళ్లి వివరాలు సేకరించారు. అయితే శివారెడ్డి వాడిన వాహనం అతని స్నేహితుడు మోడుగు శ్రీనివాస్‌రెడ్డిదని తెలుసుకుని అతన్ని సంప్రదించి అతని ద్వారా శివారెడ్డి వివరాలు తెలుసుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. రెండు నెలల క్రితం ఓ మహిళతో కూడా ఇలాగే ప్రవర్తించాడని, అతనిపై చైతన్యపురి ఠాణాలో కేసు నమోదైందని తేలింది. శుక్రవారం అతన్ని రిమాండ్‌కు తరలించారు. ఈకేసుకు సంబంధించి పోలీసులకు సమాచారం అందించి సామాజిక బాధ్యత వహించిన న్యాయవాది రవిసందీప్‌కు రూ.10 వేల నగదు బహుమతిని సీపీ అందజేశారు. అంతేకాకుండా ఎస్‌వోటీ బృందానికి సైతం నగదు అందించి అభినందించారు. సమావేశంలో ఎస్‌వోటీ అదనపు డీసీపీ సురేందర్‌రెడ్డి, షీటీం ఇన్‌ఛార్జి సలీమా, ఎల్బీనగర్‌ ఎస్‌వోటీ ఇన్‌స్పెక్టర్‌ రవికుమార్‌, ఎల్బీనగర్‌ ఇన్‌స్పెక్టర్‌ అశోక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పోకిరీల బెడదతో చాలామంది మహిళలు, యవతులు ఇబ్బందులు పడుతున్నారని, ధైర్యంగా ఫిర్యాదు చేస్తే వారి వివరాలు గోప్యంగా దాచి న్యాయం చేస్తామని సీపీ తెలిపారు. పోలీస్‌స్టేషన్‌ వెళ్లలేనివారు తనకు వాట్సాప్‌ ద్వారా 9490617111కు వివరాలు పంపినా చాలన్నారు.

న్యాయవాదికి నగదు బహుమతి ఇస్తున్న సీపీ 

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.