close

సోమవారం, ఆగస్టు 26, 2019

తాజా వార్తలు

ఇంటిపై కప్పు కూలిచిన్నారి మృతి

సికింద్రాబాద్‌: సికింద్రాబాద్‌ నియోజకవర్గంలోని సీతాఫల్‌మండిలో పురాతన భవనం కూలిన ఘటనలో ఓ బాలుడు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సీతాఫల్‌మండిలోని ఓ పురాతన భవనంలో గత కొంతకాలంగా స్వాతి దంపతులు తమ కుమారుడు గీతామ్స్‌(14నెలలు)తో నివాసముంటున్నారు. ఆదివారం ఉదయం ఇంట్లో పడుకున్న సమయంలో ఇంటి పైకప్పు ఒక్కసారిగా కూలిపోయి కొంత భాగం నిద్రిస్తున్న వీరిపై పడింది. ఈ ప్రమాదంలో చిన్నారి గీతామ్స్‌ అక్కడికక్కడే మృతిచెందగా తల్లి స్వాతి తీవ్రంగా గాయపడింది. ఇది గుర్తించిన స్థానికులు హుటాహుటిన స్వాతిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆమె భర్త ఆ సమయంలో ఇంట్లో లేరు. విషయం తెలుసుకున్న నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్‌ రవికుమార్‌ ఘటనాస్థలాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.