close

శనివారం, ఆగస్టు 24, 2019

తాజా వార్తలు

జలపాతంలో జన హోరు

జన సంద్రాన్ని తలపించిన బొగత

పిల్లల పార్కులో చిన్నారుల ఉత్సాహం


జలపాతాన్ని తిలకించేందుకు వచ్చిన పర్యాటకులతో నిండిన నీటి కొలను

 

వాజేడు, న్యూస్‌టుడే: జలపాతం జన సంద్రాన్ని తలపించింది.. బొగతలో సందర్శకులు చేస్తున్న సందడితో అటవీ ప్రాంతం పరిసర ప్రాంతాలు మారుమోగాయి. హోరుమని పడుతున్న జలపాతం నీటి ధారల సవ్వడిలో పర్యాటకులు సందడి చేశారు. ఆదివారం ఆటవిడుపుగా జలపాతంలో గడిపేందుకు వచ్చిన పర్యాటకులు నీటిధారలను తన్మయత్వంతో తిలకించారు. జలపాతం నుంచి వస్తున్న వరద నీటితో నిండిన కొలనులో చిన్నారులతో కలిసి ఈత కొడుతూ ఉల్లాసంగా గడిపారు. వరద నీటిలో గడిపిన పర్యాటకులు సమీపంలోని పగోడాలో సేదదీరుతూ సందర్శకుల కేరింతలను ఆసక్తిగా తిలకించారు. కుటుంబ సభ్యులతో వచ్చిన తల్లిదండ్రులు చిన్నారులతో కలిసి పిల్లల పార్కులో ఉల్లాసంగా గడిపారు. ఊయలలు, జారుడు బల్లలు, రోప్‌వేపై చిన్నారులను ఆటలాడిస్తూ ఉత్సాహం పొందారు. వారాంతపు సెలవు రోజైన ఆదివారం బొగత జలపాతం సందర్శనకు వచ్చిన పర్యాటకుల వాహనాలతో పార్కింగ్‌ ప్రదేశం నిండిపోయింది.

జలపాతంలో జిప్‌లైన్‌ ప్రారంభం

బొగత జలపాతం వద్ద పర్యాటకులను ఆకర్షించేందుకు జిప్‌ లైన్‌ విన్యాసాన్ని ఆదివారం ప్రారంభించారు. ఇక్కడ జిప్‌లైన్‌, జిప్‌ సైక్లింగ్‌ విన్యాసాలు చేసేందుకు అటవీ అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రయోగాత్మకంగా ఇటీవల జిప్‌ సైక్లింగ్‌ చేపట్టారు. జలపాతానికి వస్తున్న పర్యాటకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు అటవీ అధికారులు జిప్‌లైన్‌ ప్రారంభించారు. దీనిపై విన్యాసాలు చేసేందుకు యువకులు ఆసక్తి కనబర్చారు. స్నేహితులతో కలిసి జలపాతం సందర్శనకు వచ్చిన యూఏఈ(దుబయి) దేశస్థుడు అహ్మద్‌ ఆలీ పలు విన్యాసాలు చేసి ఆకట్టుకున్నారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.