close

బుధవారం, ఆగస్టు 21, 2019

తాజా వార్తలు

అలరించిన జిల్లా స్థాయి నృత్య పోటీలు

వినాయక స్తోత్రం నృత్య ప్రదర్శనలో ఇంద్రాణి
 

పాల్వంచ సాంస్కృతికం, న్యూస్‌టుడే: పాల్వంచ తెలంగాణ కళాకారుల సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని వనభారతిలో ఆదివారం నిర్వహించిన జిల్లా స్థాయి నృత్య పోటీలు అలరించాయి. శాస్త్రీయ, కూచిపూడి నృత్యాలతో పాటు సినిమా పాటలకు యువ కళాకారులు వేసిన స్టెప్పులు ఆకట్టుకున్నాయి. దమ్మపేట, పాల్వంచ, మణుగూరు, ములకలపల్లి, కొత్తగూడెం తదితర ప్రాంతాల నుంచి తరలివచ్చిన కళాకారులు అద్భుత ప్రదర్శనలతో ఔరా అనిపించారు. ఇంద్రాణి, యశస్విని, ఖ్యాతి, సాహితీ, వెంకట్‌ గౌతమ్‌ తదితరులు తమ ప్రతిభతో మెప్పుపొందారు. ఇక్కడ విజేతలుగా నిలిచిన వారిని రాష్ట్రస్థాయి ప్రదర్శనకు ఎంపిక చేస్తామని సంఘం అధ్యక్ష, కార్యదర్శులు పాయం ముత్తయ్య, డోలి సారయ్య తెలిపారు. కార్యక్రమంలో సంఘం కోశాధికారి శ్రీపాద సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు యడ్లపల్లి శ్రీనివాస్‌, నాయకులు డప్పు రాము, కనకరాజు, బాలస్వామి, గోవర్దన్‌ తదితరులు పాల్గొన్నారు.

పోటీల్లో సాహితి విన్యాసం

తరంగ నృత్యం ప్రదర్శిస్తున్న వెంకట్‌ గౌతమ్‌

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.