close

బుధవారం, ఆగస్టు 21, 2019

తాజా వార్తలు

పోడుభూముల్లో నిర్బంధాలు ఆపాలి: గుమ్మడి నర్సయ్య


మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య

కారేపల్లి, న్యూస్‌టుడే: పోడుభూముల్లో గిరిజనుల నిర్బంధాలను ఆపాలని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మాదినేని రమేశ్‌ డిమాండ్‌ చేశారు. పోడు రైతులపై ప్రభుత్వ యంత్రాంగం అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ ఆదివారం కారేపల్లి, పేరుపల్లి, మాణిక్యారం, పోలంపల్లి గ్రామాల్లోని పోడుభూములను వామపక్ష నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం అర్హులుగా ఉండి సాగు చేస్తున్న పోడుభూముల్లో కేవలం నాలుగో వంతు మాత్రమే అధికారులు హక్కు కల్పించారన్నారు. అడవుల్లో సంపదను హరితహారం పేరుతో కార్పొరేటు శక్తులకు అప్పగించే పనిలో ప్రభుత్వం ఉందన్నారు. అధికారులు అటవీ హక్కుల చట్టాన్ని తుంగలోతొక్కి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారన్నారు. పోడు భూముల సమస్యలపై ఈ నెల 24న పది వామపక్ష సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్‌ రాష్ట్ర సహాయ కార్యదర్శి జి.వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి ఎం.నాగేశ్వరరావు, గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బి.వీరభద్రంనాయక్‌, ఆదివాసీ గిరిజన సంఘం జిల్లాధ్యక్షుడు వజ్జా రామారావు, దుగ్గి కృష్ణ, వ్యకాసం నాయకులు కె.నాగేశ్వరావు, నరేంద్ర, ఏఐకేఎంఎస్‌ నాయకులు వై.ప్రకాశ్‌, జానకి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.