close

బుధవారం, ఆగస్టు 21, 2019

తాజా వార్తలు

ఆర్టికల్‌ 370 రద్దు చేయాలి

నవీపేట, న్యూస్‌టుడే: దేశమంతా ఒక్కటిగా ఉండాలంటే కశ్మీర్‌లో అమల్లో ఉన్న ఆర్టికల్‌ 370ను రద్దు చేయాలని ఆరెస్సెస్‌ జిల్లా సంఘచాలక్‌ కాపర్తి గురుచరణ్‌ డిమాండు చేశారు. మండల కేంద్రంలోని లిటిల్‌ ఫ్లవర్‌ పాఠశాలలో ఆదివారం ‘ఆర్టికల్‌ 370 - జాతీయ సమైక్యత, సమగ్రత’ అనే అంశంపై నిర్వహించిన చర్చావేదికలో ఆయన పాల్గొని మాట్లాడారు. కశ్మీర్‌లో ఉగ్రవాదులను తరిమికొట్టాలంటే ఆర్టికల్‌ 370ని తప్పకకుండా రద్దు చేయాల్సిన అవసరం ఉందన్నారు. దేశానికే కిరీటం లాంటి ఆ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా చర్చావేదికలు నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆరెస్సెస్‌ జిల్లా కార్యవాహ తమ్మల కృష్ణ, ప్రతినిధులు దాసరి గంగాధర్‌, వసంత్‌కుమార్‌, రాకేశ్‌, అరవింద్‌రెడ్డి, భానుగౌడ్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.