close

ఆదివారం, ఆగస్టు 18, 2019

తాజా వార్తలు

‘వామపక్ష విప్లవ పార్టీల ఏకీకరణ చారిత్రక అవసరం’

బషీర్‌బాగ్‌, న్యూస్‌టుడే: జాతీయవాదం పేరిట ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న నరేంద్రమోదీ పరిపాలనను ఎదుర్కొనేందుకు వామపక్ష విప్లవ పార్టీల ఏకీకరణ చారిత్రక అవసరమని విప్లవ కవి నిఖిలేశ్వర్‌ అన్నారు. భారత కమ్యూనిస్టు విప్లవకారుల సమైక్యతా కేంద్రం (మార్క్సిజం-లెనినిజం) ఆధ్వర్యంలో ఆదివారం బషీర్‌బాగ్‌ దేశోద్ధారక భవన్‌లో కమ్యూనిస్టు విప్లవ ఉద్యమకారులు దేవులపల్లి వెంకటేశ్వర్‌రావు (డీవీ), తరిమెల నాగిరెడ్డి (టీఎన్‌)ల సంస్మరణ సభను నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన నిఖిలేశ్వర్‌ మాట్లాడుతూ.. మార్క్సిజం, లెనినిజం, మావో ఆలోచన విధానాన్ని దేశ పరిస్థితులకు అనుగుణంగా విప్లవ పంథాను దేవులపల్లి వెంకటేశ్వర్‌రావు రూపొందించగా... దీనిని వ్యాప్తి చేయడంలో తరిమెల నాగిరెడ్డి నిర్వహించిన పాత్ర విశేషమన్నారు. కమ్యూనిస్టు నేత ఎస్‌.నర్సింహారెడ్డి అధ్యక్షతన కార్యక్రమంలో నవోదయ సాహితీ సాంస్కృతిక సంస్థ ప్రతినిధి జతిన్‌, యూసీసీఆర్‌ఐఎంఎల్‌ నేత సీహెచ్‌ఎన్‌ మూర్తి, ఓపీడీఆర్‌ రాష్ట్ర కార్యదర్శి డి.విజయేందర్‌రావు, గ్రామీణ పేదల సంఘం రాష్ట్ర కార్యదర్శి జి.వెంకటాద్రి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.