close

గురువారం, ఆగస్టు 22, 2019

తాజా వార్తలు

మాట సాధించలేనిది పాట సాధిస్తుంది!

శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి
పి.సుశీలకు ‘దాశరథి-సినారె’ పురస్కార ప్రదానం

రవీంద్రభారతి, న్యూస్‌టుడే: మాట సాధించలేని కార్యక్రమాలను పాట సాధిస్తుందని తెలంగాణ శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. శృతిలయ ఆర్ట్స్‌ అకాడమి, సీల్‌వెల్‌ కార్పొరేషన్‌ అధినేత బండారు సుబ్బారావుల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ‘దాశరథి- సినారె’ జయంతి వేడుకల్లో ప్రముఖ గాయని పి.సుశీలకు మంగళవారం రవీంద్రభారతి ప్రధాన మందిరంలో ‘దాశరథి- సినారె’ పురస్కార ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ..  కవులు రచించిన పాట విత్తనమైతే.. సుశీల గొంతు సారవంతమైన భూమి వంటిదని చెప్పారు. అలనాటి పాటలు ఎంతో మధురంగా, గొప్పగా ఉండేవని, ఇప్పుడొస్తున్న పాటలు అర్థం కావడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. పి.సుశీల మాట్లాడుతూ.. సినారె, దాశరథి, ఆత్రేయ వంటి ఎందరో కవులు అందించిన అద్భుతమైన సాహిత్యం, ఘంటసాల వంటి సంగీత దర్శకుల వల్లే తాను గాయనిగా నిలబడ్డానని అన్నారు. సినారె రచించిన ‘దీపానికి కిరణం ఆభరణం.. రూపానికి హృదయం ఆభరణం’ పాట తనకెంతో ఇష్టమన్నారు. తెలంగాణ శాసనసభ పూర్వ సభాపతి ఎస్‌.మధుసూదనాచారి, సీల్‌వెల్‌ కార్పొరేషన్‌ అధినేత బండారు సుబ్బారావు, యువకళావాహిని అధ్యక్షుడు వై.కె.నాగేశ్వరరావు, కళా పత్రిక సంపాదకుడు మహ్మద్‌ రఫీ, శృతిలయ ఆర్ట్స్‌ అకాడమి ఛైర్మన్‌ ఆర్‌.ఎన్‌.సింగ్‌, అధ్యక్షుడు డా.బొక్కా భీమ్‌రెడ్డి, కుసుమ భోగరాజు తదితరులు మాట్లాడారు. అంతకు ముందు గాయని ఆమని సారథ్యంలో ‘సరిలేరు నీకెవ్వరు’ శీర్షికన సమర్పించిన సంగీత విభావరి శ్రోతలను అలరించింది.

తెలుగు సాహిత్యానికి రెండు కళ్లు.. మహాకవులు దాశరథి, సినారెలు రెండు కళ్లు అయితే.. త్రినేత్రుడు కాళోజీ అని వక్తలు కొనియాడారు. తెలంగాణ సాహిత్య అకాడమి ఆధ్వర్యంలో డా. దాశరథి కృష్ణమాచార్య జయంతి నుంచి డా.సి.నారాయణరెడ్డి జయంతి వరకు నిర్వహిస్తున్న తెలంగాణ కవితా సప్తాహం రవీంద్రభారతి సమావేశ మందిరంలో జరుగుతోంది. మంగళవారం రాత్రి డా. ఎస్‌.రఘు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో కె.పి.అశోక్‌కుమార్‌ ‘తెలంగాణ కథా వికాసం’ అంశంపై ప్రసంగించారు. తెలంగాణలో అపారమైన సాహితీ సంపద, అద్భుతమైన సాహితీవేత్తలు ఉన్నారన్నారు. తెలంగాణ కథలు ఎప్పుడూ ధిక్కార స్వరాన్ని వినిపించాయన్నారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.