close

ఆదివారం, ఆగస్టు 25, 2019

తాజా వార్తలు

అదుపు తప్పి వాహనం బోల్తా..

ఇద్దరికి తీవ్రగాయాలు


బోల్తాపడిన టాటా మ్యాజిక్‌ వాహనం

నర్సాపూర్‌(జి), న్యూస్‌టుడే : మండలంలోని నర్సాపూర్‌(జి) గ్రామశివారులో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో టాటా మ్యాజిక్‌ వాహనం అదుపు తప్పి బోల్తాపడింది. స్థానికులు తెలిపిన కథనం మేరకు.. భైంసాకు చెందిన ఓ కుటుంబ సభ్యులు వేములవాడకు దైవదర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా వాహనం ముందు చక్రం పేలడంతో ప్రమాదం జరిగిందని తెలిపారు. ఈ వాహనంలో దాదాపు పది మంది ప్రయాణికులు ఉండగా సావిత్రిబాయి, సవిత అనే మహిళలకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను భైంసా ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. నర్సాపూర్‌(జి) పోలీసులు జరిగిన సంఘటను తెలుసుకుని విచారణ చేపడుతున్నారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.