ముగిసిన టెండర్ల పరిశీలన - Kurnool - EENADU
close

సోమవారం, సెప్టెంబర్ 16, 2019

తాజా వార్తలు

ముగిసిన టెండర్ల పరిశీలన

టెండరు పత్రాలు పరిశీలిస్తున్న జేసీ-2 ఖాజామోహిద్దీన్‌, ఉప కమిషనర్‌ చెన్నకేవశరావు 

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే: జిల్లాలో ప్రభుత్వ మద్యం దుకాణాల లీజు, రవాణా వాహనాలు, ఫర్నిచర్‌ ఉపకరణాల ఏర్పాటుకు సంబంధించిన టెండర్ల పరిశీలన ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. జాయింట్‌ కలెక్టర్‌-2 ఖాజా మోహిద్దీన్‌ సమక్షంలో బుధవారం స్థానిక జిల్లా పరిషత్తు హాలులో టెండర్‌ పత్రాల పరిశీలన కార్యక్రమం జరిగింది. ఈ ఏడాది సెప్టెంబర్‌ నెలాఖరు వరకు నిర్వహించాల్సిన 23 దుకాణాలకు, అక్టోబర్‌ 1 నుంచి నిర్వహించాల్సిన 164 అద్దె దుకాణాలకు మొత్తం 389 టెండర్లు వచ్చాయి. నిర్వహణకు భవనాలు లీజుకు ఇస్తే పక్కనే మందుబాబులకు కావాల్సిన తినుబండారాలు ఇతరత్రా అనుబంధ వ్యాపారులు చేసుకోవచ్చన్న ఉద్దేశంతో పలువురు యజమానులు టెండరు దాఖలు చేశారు. మహిళలు సైతం టెండర్లు దాఖలు చేయటం గమనార్హం. ప్రస్తుతం మద్యం దుకాణాలు నిర్వహిస్తున్న పాత వ్యాపారులు అధికంగా పాల్గొన్నారు. స్టేషన్ల వారిగా జేసీ, టెండరుదారుల సమక్షంలో టెండరు బాక్సులు తెరిచి పత్రాలు పరిశీలించి తక్కువ మొత్తంలో బిడ్‌ దాఖలు చేసిన యజమానులతో లీజు ఖరారు చేశారు. కిలోమీటర్‌ ప్రాతిపదికన తొమ్మిది స్లాబుల విధానంలో కర్నూలు నంద్యాల ఐఎంఎల్‌ డిపోల నుంచి మద్యం దుకాణాలకు మద్యం రవాణా చేసే వాహనాల కోసం టెండర్లు ఆహ్వానించగా కర్నూలుకు 25, నంద్యాలకు 6 టెండర్లు దాఖలు చేశారు. ఫర్నిచర్‌ ఇతర ఉపకరణాలకు వచ్చిన 34 టెండర్లు వచ్చాయి.

అధికారుల బేరసారాలు

ప్రభుత్వ మద్యం దుకాణాల ఏర్పాటుకు నిర్వహించిన టెండర్ల ప్రక్రియ విమర్శల పాలైంది. అద్దె దుకాణాల విషయంలో తక్కువ మొత్తానికి బిడ్‌ దాఖలు చేసిన వారికి ఉన్నతాధికారులు లీజు ఖరారు చేయాల్సి ఉంది. అయితే అధికారులు అద్దె తగ్గించుకోమని ఒత్తిడి చేయటం, బేరసారాలు ఆడటం వివాదాస్పదంగా మారింది. ఈ విషయమై వాగ్వాదం నెలకొని కోడుమూరు పరిధిలోని దుకాణాన్ని చివరకు రద్దుచేశారు. శ్రీశైలం నియోజకవర్గం పరిధిలో ఎక్కువ మొత్తానికి బిడ్‌ దాఖలు చేసిన టెండరుదారుని ఇచ్చారంటూ కొందరు అధికారులపై మండిపడ్డారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.