close

బుధవారం, మార్చి 20, 2019

తాజా వార్తలు

అగ్రవర్ణాల రిజర్వేషన్లపై కేంద్రం వెనక్కి తగ్గే వరకు పోరాడతాం

గుంటూరు సిటీ: కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణాల్లోని పేదలకు 10 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బిల్లుకు నిరసనగా ఆంధ్రప్రదేశ్‌ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జిల్లాలోని కలెక్టరేట్‌ కూడలి వద్ద శుక్రవారం నిరసన ప్రదర్శించారు. ఈ సందర్భంగా సంఘ రాష్ట్ర అధ్యక్షుడు శంకరరావు మాట్లాడుతూ.. సామాజిక వివక్షకు గురయ్యేవారు మాత్రమే రిజర్వేషన్ల ఫలాలు పొందేందుకు అనుగుణంగా డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ రాజ్యాంగంలో పొందుపరిచారని తెలిపారు. రాబోయే కాలంలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కేంద్రంలోని భాజపా ప్రభుత్వం ఓసీల ఓటు బ్యాంక్‌ పొందేందుకే హుటాహుటిన వారికి పది శాతం రిజర్వేషన్‌ ప్రకటించారని వెల్లడించారు. దేశవ్యాప్తంగా అధిక సంఖ్యలో ఉన్న బీసీలకు 50 శాతం మాత్రమే రిజర్వేషన్లు కల్పిస్తుంటే, స్వల్ప శాతంలో ఉన్న ఓసీలకు మాత్రం పది శాతం రిజర్వేషన్‌ ఏ విధంగా ప్రకటిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్రం అగ్రవర్ణాలకు ప్రకటించిన రిజర్వేషన్లపై వెనక్కి తగ్గకుంటే రాబోయే కాలంలో తమ పోరాటాలను ఉద్ధృతం చేస్తామన్నారు. ముందుగా మార్కెట్‌ కూడలిలోని జ్యోతిరావు పూలే విగ్రహం నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీని ప్రదర్శించారు. 

జిల్లా వార్తలు

మరిన్ని వార్తలు

షూస్‌ కంటైనర్‌ తనిఖీ

చిలకలూరిపేటలోని ప్రభుత్వ పాఠశాలలకు షూస్‌ పంపిణీ చేయడానికి చిలకలూరిపేటకు వచ్చిన షూస్‌ కంటైనర్‌ను ఎన్నికల ఫ్లయింగ్‌ స్వ్కాడ్‌ బృంద సభ్యులు మంగళవారం తనిఖీ చేశారు. దీనికి సంబంధించి ఎన్నికల ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ సభ్యులు మాట్లాడుతూ సర్వశిక్ష అభియాన్‌కు సంబంధించి విద్యార్థులకు షూస్‌ పంపిణీ చేసేందుకు రాజస్థాన్‌ నుంచి కంటైనర్‌ చిలకలూరిపేటకు వచ్చిందన్నారు. మధ్యలో విజయవాడలో కొన్ని షూస్‌ అన్‌లోడ్‌ చేశారని, తర్వాత చిలకలూరిపేట ఎంఈవో కార్యాలయంలో దించడానికి కంటైనర్‌ వెళ్తుండగా ఆపి తనిఖీ చేశామన్నారు. దీనిలో 7614 జతల షూస్‌ ఉన్నాయన్నారు. కంటైనర్‌

ప్రధానాంశాలు

పోలింగ్‌ శాతాన్ని పెంచటమే లక్ష్యం

సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్‌ శాతాన్ని పెంచేందుకు స్వీప్‌ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించి ప్రజల్ని చైతన్యపర్చనున్నటు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ కోన శశిధర్‌ తెలిపారు. కలెక్టరేట్‌లో మంగళవారం స్వీప్‌ ఆధ్వర్యంలో ఓటు వేసే విధానాన్ని తెలుపుతూ నమూనా బ్యాలెట్‌లను రూపొందించారు. ఈ కార్యక్రమాన్ని కలెక్టర్‌ కోన శశిధర్‌ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్న లక్ష్యంతో వీటిని ప్రధాన కూడళ్లు, కళాశాలలు తదితర ప్రాంతాల్లో ప్రదర్శించనున్నట్లు తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటుకు అత్యంత విలువ ఉందని, ప్రతి ఓటరు తమ ఓటు హక్కును తప్పనిసరిగా

మోయా-మోయా వ్యాధి బాధితునికి అరుదైన శస్త్రచికిత్స

జపాన్, కొరియా, చైనా దేశాల్లో కనిపించే మోయా- మోయా అనే అరుదైన వ్యాధితో గుంటూరు జిల్లాకు చెందిన ఓ బాలుడు(4) బాధపడుతున్నట్లు గుర్తించారు. రెండేళ్ల కిందట ఎడమ చేయి, కాలు చచ్చుబడిపోయింది. అప్పటి నుంచి నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో మందులు వాడుతున్నప్పటికీ అంత ప్రయోజనం కనిపించలేదు. ఇటీవల ఫిట్స్‌(మూర్ఛ) సమస్య కూడా తోడైంది. దీంతో ఆ చిన్నారిని నగరంలోని తులసి మల్టీ స్పెషాలిటీ వైద్యశాలలో ఇటీవల చేర్పించారు. ఆ వైద్యశాల కన్సల్టెంట్‌ న్యూరోసర్జన్, సర్వజనాసుపత్రి సహాయ ఆచార్యులు భవనం హనుమ శ్రీనివాసరెడ్డి వైద్య పరీక్షలు నిర్వహించి మెదడు సర్జరీతో ఈ సమస్యను చాలావర

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.