close

సోమవారం, ఆగస్టు 19, 2019

తాజా వార్తలు

వ్యాక్సినేషన్‌పై అప్రమత్తత అవసరం

వ్యాక్సినేషన్‌పై అప్రమత్తత అవసరం

కామారెడ్డి పట్టణం, న్యూస్‌టుడే: వ్యాక్సినేషన్‌పై సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారి చంద్రశేఖర్‌ పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలో మంగళవారం ఈ-విన్‌ శిక్షణ పూర్తి చేసుకున్న సిబ్బందికి ధ్రువపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరోగ్య కేంద్రాల్లో పిల్లలకు, గర్భిణులకు అందజేసే 9 రకాల వ్యాక్సిన్లను కోల్డ్‌ చైన్‌ పాయింట్లల్లో నిల్వ ఉంచాలన్నారు. ఆరోగ్య కార్యకర్తలు రోజూ వారి వినియోగం, నిల్వ కేంద్రాల నిర్వహణ తదితర అంశాలను ఈ-విన్‌ యాప్‌లో పొందుపరచాలని సూచించారు. కార్యక్రమంలో వ్యాధినిరోధక అధికారి అనిల్‌, డీఐవో శోభారాణి, వైద్యాధికారులు శోభారాణి, రాజు, మనీష్‌కుమార్‌, సంజీవరెడ్డి తదితరులున్నారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.