close

శుక్రవారం, ఫిబ్రవరి 22, 2019

తాజా వార్తలు

విద్యుత్‌ చౌర్యంపై నిఘా 

టోల్‌ఫ్రీ నంబర్లపై విస్తృత ప్రచారం 
అధికారులు స్థానికంగా ఉండాలని ఆదేశాలు 
న్యూస్‌టుడే, నిజామాబాద్‌ అర్బన్‌

విద్యుత్‌ చౌర్యంపై నిఘా 

విద్యుత్‌ చౌర్యం, వినియోగదారుల సమస్యలు పరిష్కరించే విషయంపై ప్రత్యేక దృష్టి పెట్టామని ఎన్‌పీడీసీఎల్‌ ఎస్‌ఈ సుదర్శన్‌ తెలిపారు. జిల్లా కేంద్రంలో గతంలో ఏఈ, ఏడీఈ, డీఈగా పలు మండలాల్లో పనిచేసిన అనుభవం ఉంది. కాబట్టి విద్యుత్‌ సమస్యలపై అవగాహన ఉంది. శాఖాపరంగా పని విషయంలో  ఎవరినీ వదిలిపెట్టేది లేదు. కింది స్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు ప్రతి ఒక్కరు వినియోగాదారుల కోసం పనిచేయాల్సిందేనని, లేదంటే చర్యలు తప్పవని ‘న్యూస్‌టుడే’ ముఖాముఖిలో పేర్కొన్నారు.

? ప్రశ్న: వినియోగదారుల సమస్యలు తెలుసుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? 
ఎస్‌ఈ: విద్యుత్‌ శాఖకు చెందిన ప్రతి సమస్య నేరుగా తెలుసుకునేందుకు టోల్‌ఫ్రీ నంబర్లపై విస్తృత ప్రచారం చేయాలని నిర్ణయించాం. టోల్‌ ఫ్రీ నంబర్లు: 18004250028, 1912, 9440811600. ఈ మూడు నంబర్లు 24 గంటలు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు సిద్ధంగా ఉంటాయి. వీటిని ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా ప్రచారం చేసే ఏర్పాట్లు చేశాం. ఇప్పటికే స్టిక్కర్లు ముద్రించే ఏర్పాట్లు చేయిస్తున్నాం. వీటిని ప్రజలు సంచరించే ప్రాంతాలైన రైల్వే స్టేషన్‌, బస్టాండు, సినిమా థియేటర్లు, అన్ని విద్యుత్‌ శాఖ కార్యాలయాల వద్ద అతికించే ఏర్పాట్లు చేస్తున్నాం.

? ప్ర: మెరుగైన విద్యుత్‌ సరఫరా చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? 
ఎస్‌ఈ: చెట్లకొమ్మల వల్ల తరచూ విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకొని చెట్లకొమ్మలు తొలగిస్తున్నాం. రోడ్‌క్రాసింగ్‌ల వద్ద వాహనాలు తగలకుండా ఎత్తయిన స్తంభాలు వేసి లైన్లు ఏర్పాటు చేస్తున్నాం. తక్కువ ఎత్తులో ఉన్న నియంత్రికలను పిల్లర్లు నిర్మించి వాటిపై ఏర్పాటు చేస్తున్నాం. అంతరాయం కలగకుండా ఇన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నాం.

? ప్ర: జిల్లాలో ఓవర్‌లోడ్‌ సమస్య ఇబ్బందికరంగా మారింది కదా? 
ఎస్‌ఈ: వీలైనంత వరకు ఇప్పటికే ఈ సమస్యను గుర్తించిన ప్రాంతాల్లో అదనంగా నియంత్రికలు ఏర్పాటు చేస్తున్నాం. ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తే తప్పకుండా కొత్త నియంత్రికలు ఏర్పాటు చేసి సమస్య లేకుండా చూస్తాం.

? ప్ర: వ్యవసాయ కనెక్షన్లు ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారని రైతులు ఫిర్యాదులు చేస్తున్నారు కదా? 
ఎస్‌ఈ: ప్రస్తుతం అలాంటిదేమీ లేదు. వ్యవసాయ కనెక్షన్లు అడగ్గానే 3 నెలల్లోపు ఇస్తున్నాం. గతంలో ఈ సమస్య ఉండేది. ప్రస్తుతం లేదు. జిల్లా వ్యాప్తంగా కేవలం 900 కనెక్షన్లు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. ఎక్కువ ఆలస్యం చేస్తే నా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటా.

? ప్ర: పాత పరికరాలతోనే కాలం వెల్లదీస్తుండటం వల్లే అంతరాయం వంటి సమస్యలు వస్తున్నాయా? 
ఎస్‌ఈ: మీరన్నట్లు గతంలో ఈ పరిస్థితి ఉండేది. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. వీలైనంత వరకు దశలవారీగా కొత్త పరికరాలు ఏర్పాటు చేస్తూనే ముందుకు సాగుతున్నాం. 9 గంటల విద్యుత్‌ సరఫరా వల్ల అనేక ప్రాంతాల్లో కొత్త పరికరాలు ఏర్పాటు చేశాం. పాత వాటిని ఎప్పటికప్పుడు తొలగిస్తూ కొత్తవి ఏర్పాటు చేస్తున్నాం.

? ప్ర: క్షేత్రస్థాయిలో సిబ్బంది సరిగా పనిచేయకపోడం వల్లే నియంత్రికలు కాలిపోవడం, ఇతర సమస్యలు ఎక్కువవుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై మీరేమంటారు? 
ఎస్‌ఈ: నేను కొత్తగా బాధ్యతలు స్వీకరించాను. మొన్నటి వరకు ఉన్న పరిస్థితి నాకు తెలియదు కానీ నా విషయానికి వస్తే నేను ఒకటే చెబుతాను. ఉదయం లేవగానే 8 గంటల వరకు సిబ్బంది క్షేత్రస్థాయిలోఉండాల్సిందే. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవరించిన వారిపై కఠిన చర్యలు తప్పవు. ప్రభుత్వం మంచి వేతనాలు ఇస్తుంది. చక్కగా పనిచేసి వినియోగదారులకు ఇబ్బంది లేకుండా చూడాలన్నదే నా లక్ష్యం.

ప్ర: క్షేత్రస్థాయిలో విద్యుత్‌ అంతరాయం    ఏర్పడితే లైన్‌మెన్లు, ఇతర సిబ్బంది ఫోన్‌ లేపడం లేదని, సమస్యలు చెప్పినా స్పందించడం లేదనే ఫిర్యాదులు ఉన్నాయి కదా? 
ఎస్‌ఈ: అందుకే టోల్‌ఫ్రీ నంబర్లను విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించాం. ఎవరైతే   లైన్‌మెన్లు, ఇతర సిబ్బంది ఫోన్‌ చేస్తే     స్పందించరో వెంటనే టోల్‌ఫ్రీ నంబర్లకు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయాలి. నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై తప్పకుండా చర్యలు తీసుకుంటాం.

ప్ర: విద్యుత్‌ సిబ్బంది గ్రామాల్లో ఉండడం లేదని, ముఖ్యంగా సమస్యలు పట్టించుకోవడం లేదనే ఆరోపణల ఉన్నాయి? మీ దృష్టికి వచ్చాయా? 
ఎస్‌ఈ: ప్రతి ఒక్క ఉద్యోగి వారికి కేటాయించిన ప్రాంతాల్లోనే నివాసం ఉండాలి. ఈ విషయంపై కఠినంగా వ్యవహరిస్తాం. ఇప్పటికే స్థానికంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశాం. నెల రోజులు మాత్రమే గడువు ఇచ్చాం. మండలంలో ఉన్నా, గ్రామంలో ఉన్నా నివాసం ఉంటున్న ఇంటి విద్యుత్‌ బిల్లు, ఇంటి నంబరు, ఇతర వివరాలు సమర్పించాలని చెప్పాం. స్థానికంగా లేని పక్షంలో తప్పకుండా చర్యలు తీసుకుంటాం.

ప్ర: యథేచ్ఛగా విద్యుత్‌ చౌర్యానికి పాల్పడుతున్నారు. ఈ విషయంలో శాఖాపరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? 
ఎస్‌ఈ: విద్యుత్‌ చౌర్యం చేస్తున్న విషయం తెలుసుకునేందుకు కార్యాలయం వద్ద ఫిర్యాదుల పెట్టె ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. విద్యుత్‌ చౌర్యం చేస్తున్నట్లు తెలిస్తే పూర్తి వివరాలు రాసి ఆ చీటీని ఫిర్యాదు బాక్సులో వేస్తే తగిన చర్యలు తీసుకుంటాం. ఫిర్యాదు చేసే వారు వారి పేర్లు, వివరాలు రాయన వసరం లేదు. ఇక రెండు రోజుల క్రితమే జిల్లా కేంద్రంలోని డి-3 సబ్‌స్టేషన్‌   పరిధిలో ఒకే రోజు 1736 మీటర్లు తనిఖీ చేశాం. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగిస్తాం. ఎవరినీ వదిలిపెట్టేది లేదు. చౌర్యానికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం. నగరంలోని ప్రతి కాలనీ తనిఖీ చేస్తాం. మండలాలు, గ్రామాల ప్రాంతాల్లో సైతం ఆకస్మిక దాడులు చేస్తున్నాం

జిల్లా వార్తలు

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.