close

బుధవారం, మార్చి 20, 2019

తాజా వార్తలు

ఆటోను ఢీకొన్న లారీ

ముగ్గురి మృతి.. నలుగురికి గాయాలు

ధారూర్‌వికారాబాద్‌ జిల్లా ధారూర్‌ మండలం ఇబ్బనూర్ గ్రామ సమీపంలో సిమెంటు లోడ్‌తో వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ  ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో నలుగురు గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం..ధారూర్‌ మండలం ఇబ్బనూర్‌ గ్రామానికి చెందిన భీమయ్య అనే వ్యక్తి ఈ నెల 14న రోడ్డు ప్రమాదంలో మరణించాడు. అదే మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన భీమయ్య బంధువులు అంత్యక్రియలకు ఆటోలో బయలుదేరారు. వారు ఇబ్బనూరు చెరువు సమీపంలోని మలుపు వద్దకు రాగానే ధారూర్‌ నుంచి వికారాబాద్‌ వైపు సిమెంట్‌ లోడ్‌తో వెళ్తున్న లారీ అదుపుతప్పి ఆటోని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న కమలమ్మ(44), శారద(32), అర్చన(11) అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన గోపాల్‌, జగన్‌, అక్షయ, సంతోషలను స్థానిక ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను వికారాబాద్‌ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. లారీ డ్రైవర్‌ పరారీలో ఉన్నాడని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

జిల్లా వార్తలు

ప్రధానాంశాలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.