ఎడిటింగ్ కోసం..
ఇప్పుడంతా వీడియోల జమానా నడుస్తోంది. నిమిషాల్లో వీడియో తీసేయడం క్షణాల్లో సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేసేయడం. మరి వీడియో ఎడిటింగ్ సంగతేంటి? ఇందుకు ప్లే స్టోర్లో అనేక రకాల యాప్స్ ఉన్నాయి. కొన్ని సామాజిక మాధ్యమ యాప్లు ఇన్బుల్ట్గా వీడియో ఎడిటింగ్ ఫీచర్ను ఇచ్చేస్తున్నాయి. మరి ప్రత్యేకంగా వీడియో ఎడిటింగ్ యాప్ కావాలనుకునేవారు ‘కైన్ మాస్టర్’ని ప్రయత్నించొచ్ఛు మల్టీలేయర్ వీడియో, రివర్స్ వీడియో, అందమైన ఎఫెక్ట్స్, ఎడిటింగ్ టూల్స్, వీడియో క్రాప్, స్పీడ్ కంట్రోల్, కలర్ ఫిల్టర్స్ ఇలా అనేక రకాల ఫీచర్లతో మీ వీడియోను అందంగా మార్చుకోవచ్ఛు గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉంది.
- ఆర్. కుమారస్వామి