close

ప్ర‌త్యేక క‌థ‌నం

కొత్త మంత్రుల నేపథ్యం

తన్నీరు హరీశ్‌రావు 

పుట్టిన తేదీ: 3.6.1972
విద్యార్హత: బీఏ
భార్య: శ్రీనిత
కేసీఆర్‌ మేనల్లుడైన హరీశ్‌రావు పార్టీ ఆవిర్భావం నుంచి తెరాసలో ఉన్నారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి రాగా తెరాస ఆ ప్రభుత్వంలో చేరింది. అప్పటికి ఎమ్మెల్యేగా లేకపోయినా హరీశ్‌రావును మంత్రిపదవి వరించింది. యువజన సంక్షేమ మంత్రిగా చేరారు. అదే సంవత్సరం సిద్దిపేట ఉప ఎన్నికలో ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పటికి ఆయన వయస్సు 32 సంవత్సరాలు. 2005లో మంత్రి పదవికి రాజీనామా చేశారు. 2008లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, మళ్లీ ఎమ్మెల్యేగా  విజయం సాధించారు. 2009 సాధారణ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2010లో పదవికి  రాజీనామా చేసి ఉప ఎన్నికలో విజయం సాధించారు. 2014, 2018 సాధారణ ఎన్నికల్లో గెలిచారు. 2014 నుంచి 2018 వరకు నీటిపారుదల, శాసనసభ వ్యవహారాలు తదితర శాఖల విధులు నిర్వర్తించారు. 

కల్వకుంట్ల తారక రామారావు 

పుట్టిన తేదీ: 24.7.1976
విద్యార్హత: ఎమ్మెస్సీ, ఎంబీఏ
భార్య: శైలిమ
అమెరికాలో ఉద్యోగం మానేసి వచ్చి కేసీఆర్‌కు తోడుగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న కేటీఆర్‌ 2009లో సిరిసిల్ల నియోజకవర్గం నుంచి తెరాస తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. 2010లో పదవికి రాజీనామా చేసి, ఉప ఎన్నికల్లో విజయం సాధించారు. 2014, 2018లోనూ గెలుపొందారు. రాష్ట్ర ఆవిర్భావం అనంతరం తెరాస అధికారంలోకి వచ్చాక పంచాయతీరాజ్‌, ఐటీ శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2016లో జరిగిన మార్పుల్లో ఐటీ, పరిశ్రమలు, పురపాలక, చేనేత శాఖలను స్వీకరించారు. 2018లో తెరాస రెండోసారి అధికారంలోకి వచ్చాక ఆయన పార్టీ తొలి కార్యనిర్వాహక అధ్యక్షునిగా నియమితులయ్యారు.

పువ్వాడ అజయ్‌కుమార్‌ 

భార్య: వసంతలక్ష్మి
స్వస్థలం: ఖమ్మం 
పుట్టిన తేదీ: 19.4.1965 
విద్యార్హతలు: ఎమ్మెస్సీ (వ్యవసాయం)
మాజీ ఎమ్మెల్సీ పువ్వాడ నాగేశ్వర్‌రావు కుమారుడు. 2014లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. కాంగ్రెస్‌ తరఫున ఖమ్మం ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత తెరాసలో చేరారు. 2018లో ఖమ్మం నియోజకవర్గం నుంచి రెండోసారి గెలిచారు.

పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి 

పుట్టిన తేదీ: 5.5.1963
విద్యార్హత: బీఎస్సీ
మాజీ మంత్రి ఇంద్రారెడ్డి సతీమణి అయిన ఆమె భర్త మరణానంతరం 2000 సంవత్సరంలో రాజకీయాల్లో చేరారు. ఆ సంవత్సరం జరిగిన చేవెళ్ల శాసనసభా స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ తరఫున గెలిచారు. 2004లో కూడా అక్కడే విజయం పొందారు. 2009 వరకు గనుల శాఖ మంత్రిగా చేశారు. 2009 శాసనసభ ఎన్నికల్లో మహేశ్వరం నుంచి విజయం సాధించారు. 2014 వరకు హోంశాఖ మంత్రిగా పనిచేశారు. 2014 ఎన్నికలలో ఓడిపోయారు. మళ్లీ 2018లో గెలిచారు. కాంగ్రెస్‌ నుంచి గెలుపొందిన ఆమె ఆ పార్టీ శాసనసభాపక్షం తెరాసలో విలీనం కావడంతో తెరాస సభ్యురాలిగా మారారు.

సత్యవతి రాఠోడ్‌

స్వస్థలం: మహబూబాబాద్‌ జిల్లా కురవి మండలం గుండ్రాతి మడుగు పెద్ద తండా 
భర్త: గోవింద్‌ రాఠోడ్‌
విద్యార్హత: ఎనిమిదో తరగతి
సర్పంచిగా రాజకీయ జీవితం ప్రారంభించిన ఆమె జడ్పీటీసీ సభ్యురాలిగా పనిచేశారు. 2009లో డోర్నకల్‌ నియోజకవర్గం నుంచి తెదేపా ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత తెరాసలో చేరారు. మార్చి 30న తెరాస తరఫున శాసనమండలి సభ్యురాలిగా ఎంపికయ్యారు. ప్రస్తుతం తెరాస ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు.

గంగుల కమలాకర్‌

స్వస్థలం: కరీంనగర్‌ 
పుట్టిన తేదీ: 8.5.1968
విద్యార్హత: బీటెక్‌ (సివిల్‌)
భార్య: రజిత
2000లో తెదేపా నుంచి రాజకీయ ప్రవేశం చేసిన ఆయన కరీంనగర్‌లో కౌన్సిలర్‌, కార్పొరేటర్‌గా సేవలందించారు. 2009లో ఆ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచి, తెరాసలో చేరారు. 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీలో వివిధ పదవులను నిర్వహించారు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.