
ప్రత్యేక కథనం
ఏకాగ్రత కోల్పోతున్న సాంకేతిక విద్యార్థులు
తోడవుతున్న భయాలు, జ్ఞాపకశక్తి, ప్రేమ
ఏఎన్‌యూ విశ్రాంత అధ్యాపకుడు శంకర పిచ్చయ్య అధ్యయనంలో వెల్లడి
డాలర్ కలలకు రహదారి లాంటి ఇంజినీరింగ్‌పై తెలుగురాష్ట్రాల్లో ఆసక్తి అపారం. కానీ విద్యార్థుల సామర్థ్యం నానాటికీ ఉసూరుమంటోంది. అదనపు సామర్థ్యాల మాట అటుంచి, చదువుపైనా శ్రద్ధ పెట్టలేకపోతున్నారు. ఈ పరిస్థితికి కారణాలపై ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం విశ్రాంత అధ్యాపకుడు ఆచార్య పొదిల శంకర పిచ్చయ్య 963 మందిపై (548 మంది అబ్బాయిలు, 415 మంది అమ్మాయిలు) నిర్వహించిన అధ్యయనం పలు అంశాలను వెలుగులోకి తెచ్చింది.
![]() * సబ్జెక్టు అర్థం కాకపోయినా, అధ్యాపకులపై సదభిప్రాయం లేకపోయినా, ఆరోగ్య సమస్యలున్నా ఏకాగ్రత కోల్పోతారు. విద్యార్థులను చైతన్యపరచటం ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చు. మార్పు రాకపోతే సైకాలజిస్టును కలవాలి. |
![]() * వారి భయమేంటో తల్లిదండ్రులు తెలుసుకుని వారికి దగ్గరగా ఉంటూ వాటిని అధిగమించేలా చేయాలి. చదువులో వెనకబడితే అధ్యాపకులు, తోటి విద్యార్థులు హేళన చేస్తారని భయపడతారు. తల్లిదండ్రులే పిల్లలను వెంటబెట్టుకుని అధ్యాపకులను కలిసి మాట్లాడాలి. దీంతో క్రమేపీ భయాలు పోతాయి. |
![]() * జ్ఞాపకశక్తి పెరగాలంటే ధ్యానం, యోగా చేయించాలి. గుర్తురానివాటిని తరచూ చదివించి, రాయించాలి. |
![]() * వారు రాసింది అధ్యాపకులకు అర్థంకాక విద్యార్థులు మార్కులు కోల్పోతున్నారు. పాఠశాల స్థాయి నుంచే ఈ సమస్యను అధిగమించాలి. |
![]() * విద్యార్థికి ఆసక్తిలేని చదువు చెప్పించకూడదు. తల్లిదండ్రుల బలవంతం సరికాదు. విద్యార్థుల ఆసక్తి గుర్తించి అందులోనే ప్రోత్సహించాలి. |
![]() * పిల్లలకు బయట హోటళ్లలో ఆహారం వల్ల అనారోగ్య సమస్యలొస్తాయి. కొందరు చదవలేక ఒత్తిడికి గురవుతూ తగినంత తినక నీరసిస్తున్నారు. ఏటా విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు చేయించడం ద్వారా ఈ సమస్యను అధిగమించొచ్చు. |
![]() * చెడగొట్టడానికి ప్రయత్నించేవారు, అనవసర విషయాలపై చర్చించేవారు మంచి స్నేహితులు కారని గ్రహించాలి. నిజాయితీగా ఉంటూ తమ ఎదుగుదల కోరుకునేవారిని గుర్తించి వారితో స్నేహం చేయాలి. తల్లిదండ్రుల మార్గదర్శకత్వం తప్పనిసరి. |
![]() * ఇలాంటి విద్యార్థులను యాజమాన్యాలు గుర్తించి.. వారి తల్లిదండ్రులతో తరచు ఫోన్లో మాట్లాడించటం, అవసరమైతే ఇంటికి పంపే ఏర్పాట్లు చేయడం ద్వారా విద్యార్థులు ఇంటిపై బెంగను పోగొట్టుకుంటారు. |
![]() * ర్యాగింగ్‌కు గురైనవారికి అధ్యాపకులు అండగా నిలవాలి. ర్యాగింగ్ నివారణకు క్రమశిక్షణ కమిటీలు ఏర్పాటుచేయాలి. |
![]() * విద్యార్థులకు మొదటి సంవత్సరంలోనే ప్రేమ, దానివల్ల తలెత్తే మంచి-చెడులను వివరించాలి. ప్రేమ పేరుతో తల్లిదండ్రులకు తలనొప్పులు తేవడంపై అవగాహన కల్పించాలి. |
అధ్యయనం చేసిందిలా * చదువులో ఎందుకు వెనకబడుతున్నారో అన్నదానిపై 10 అంశాలతో ప్రశ్నావళిని విద్యార్థులకు అందజేసి కారణాలను రాబట్టారు.* విద్యార్థులలో చాలామంది ఒకటి కంటే ఎక్కువ కారణాలను పేర్కొన్నారు. (శాతాల మొత్తం 100 దాటడానికి కారణం ఇదే) * గుంటూరు శివారులోని రెండు, బాపట్లలో రెండు, మార్కాపురంలో రెండు, చీరాలలో ఒకటి, కృష్ణాజిల్లా ఆగిరిపల్లిలోని ఓ కళాశాలలో నిర్వహించారు. |
- ఈనాడు, గుంటూరు
మరిన్ని
జిల్లా వార్తలు

దేవతార్చన
- దిశ హత్య కేసు నిందితుల ఎన్కౌంటర్
- ‘సాహో సజ్జనార్’ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం
- దిశ ఆధారాలపై ‘సూపర్ లైట్’
- జీవచ్ఛవాన్నీ కాల్చేశారు..!
- తెలంగాణ పోలీసులకు సెల్యూట్: సినీ ప్రముఖులు
- పోలీసులపై పూల జల్లు
- నాడు స్వప్నిక.. నేడు దిశ!
- ‘హైదరాబాద్ పోలీసులను చూసి నేర్చుకోవాలి’
- ‘ఆ బుల్లెట్లు దాచుకోవాలని ఉంది’
- ఊరెళ్లి వచ్చేస్తానన్నాడు..