
ప్రత్యేక కథనం
కడుపులో నలుసు పడకున్నా.. గర్భవతిగా చికిత్స
పరీక్షించిన నలుగురు వైద్యులు
చివర్లో వ్యాధితో బాధపడుతోందని నిర్ధరణ
ఆదిలాబాద్ జిల్లాలో వెలుగుచూసిన మోసం
సిరికొండ - న్యూస్‌టుడే
ఇల్లాలి కడుపులో ఓ నలుసు పడిందంటే ఇంటిల్లిపాదికీ ఎంత ఆనందం..! నవ మాసాలూ మోసి, ఓ బుజ్జాయి తమ మధ్యకు వచ్చే వేళ ఎంత ఉద్విగ్నం..!! పరీక్షల పేరిట అలాంటి ఆనందం, భావోద్వేగాలతో వైద్యులు నెలల తరబడి ఆటలాడుకుంటే ఆ నిర్లక్ష్యాన్ని ఏమనాలి? గర్భం దాల్చకున్నా.. గర్భవతిగా పేర్కొంటూ ఆసుపత్రుల చుట్టూ తిప్పిన తీరును, ఆ కుటుంబం.. ప్రత్యేకించి ఆ మహిళ మానసిక పరిస్థితిని, ఆమె ఆవేదనను ఎలా వర్ణించాలి??ఇందుకు అద్దం పట్టే అమానవీయ ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. వైద్యులు సరైన పరీక్షలు నిర్వహించకుండానే ఓ మహిళను గర్భిణిగా నిర్ధరించారు. మసిపూసి మారేడుకాయ చేసి ఓ వ్యవసాయ కుటుంబాన్ని ఏకంగా 10 నెలలపాటు ఇబ్బందులకు గురిచేశారు. పరీక్షల పేరిట వేలకు వేలు కాజేశారు.
ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం సోంపెల్లికి చెందిన బుస్సవాడే సోనే అనే మహిళ 4.10.2018న గర్భం దాల్చినట్టుగా అనుమానం వచ్చి ఆదిలాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యురాలిని సంప్రదించారు. పరీక్షలు చేసిన వైద్యురాలు రెండు నెలల గర్భిణి అని చెప్పారు. దాదాపుగా 5 నుంచి 6 సార్లు ఈమె దగ్గర సోనే పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం రిమ్స్‌లో ఓ గైనకాలజిస్టును రెండుసార్లు సంప్రదించారు. పరీక్షలన్నీ నిర్వహించిన ఆ వైద్యురాలు.. మాయ కిందకు వచ్చిందని, తప్పక శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుందని సూచించారు. అనంతరం 9.9.2019 నాడు మళ్లీ వెళ్లగా ఈనెల 12న సిజేరియన్ చేస్తానని చెప్పడంతో ఆరోజు వారు రిమ్స్‌లో చేరారు. వైద్య సిబ్బంది 24 గంటలపాటు ఆసుపత్రిలో ఉంచుకొని రక్త, మూత్ర పరీక్షలకు నమూనాలను సేకరించారు. మరో 24 గంటల్లో రిపోర్ట్ వస్తుందని చెప్పారు. తరువాత ఎవరూ పట్టించుకోలేదు. అప్పటికే నెలలు నిండిపోవడంతో కుటుంబసభ్యులు భయపడి గర్భిణిని నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షలు నిర్వహించిన సిబ్బంది ఆమె గర్భిణి కాదని, ఓ వ్యాధితో బాధపడుతుందని తేల్చడంతో ఒక్కసారిగా వారు నిర్ఘాంతపోయారు. వాస్తవంగా ఆమె గర్భం దాల్చలేదు. స్కానింగ్ రిపోర్ట్‌లో ఒవేరియన్ ట్యూమర్ సమస్య ఉండగా, కనీసం వైద్యులు దాన్ని కూడా బాధితులకు తెలియజేయలేదు.
సిజేరియన్ చేయమని వచ్చారు మూడు రోజుల క్రితం బుస్సవాడె సోనే అనే మహిళ కుటుంబంతో మా ఆసుపత్రికి వచ్చారు. కాన్పు చేయమని చెప్పడంతో వెంటనే స్కానింగ్, ఇతర పరీక్షలు నిర్వహించాం. నిజానికి ఆమె గర్భిణి కాదు. సూడోసైసిస్ అనే వ్యాధితో బాధపడుతోంది. హార్మోన్ల లోపం, గర్భాశయంలో గడ్డల వల్ల నెలసరి నిలిచిపోయి ఉంటుంది. పూర్తి నిర్ధరణకు కొన్ని పరీక్షలు చేయాల్సి ఉంది. ఈ విషయం వారి కుటుంబ సభ్యులకు తెలియజేశాం. - డా।।అనిత, నిర్మల్
|
చికిత్సలో దగా నా భార్య గర్భం దాల్చినట్టు అనుమానించి వైద్యురాలి దగ్గరకు వెళితే అన్ని పరీక్షలు చేసి గర్భవతి అని తేల్చారు. అప్పటి నుంచి ఏడు సార్లు ఒక డాక్టర్ వద్దకు, తరువాత రిమ్స్‌లో పనిచేసే మరో వైద్యురాలి దగ్గరికి వెళ్లాం. రిమ్స్‌లో మమ్మల్ని పట్టించుకోకపోవడంతో నిర్మల్‌కు తీసుకెళ్లాం. అక్కడి డాక్టర్ మాట విని నిర్ఘాంతపోయాం. అంతా మమ్మల్ని దగా చేశారు. రిమ్స్‌లో మా రికార్డును మాయం చేశారు. ఇప్పుడు అసలు అక్కడకు రానేలేదంటున్నారు. అధికారులు మాకు న్యాయం చేయాలి. |
మరిన్ని

దేవతార్చన
- దిశ హత్య కేసు నిందితుల ఎన్కౌంటర్
- ‘సాహో సజ్జనార్’ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం
- దిశ ఆధారాలపై ‘సూపర్ లైట్’
- జీవచ్ఛవాన్నీ కాల్చేశారు..!
- తెలంగాణ పోలీసులకు సెల్యూట్: సినీ ప్రముఖులు
- పోలీసులపై పూల జల్లు
- నాడు స్వప్నిక.. నేడు దిశ!
- ‘హైదరాబాద్ పోలీసులను చూసి నేర్చుకోవాలి’
- ‘ఆ బుల్లెట్లు దాచుకోవాలని ఉంది’
- ఊరెళ్లి వచ్చేస్తానన్నాడు..