
ప్రత్యేక కథనం
కేరళ: కేరళలోని కొచ్చిలో దారుణం చోటుచేసుకుంది. 17ఏళ్ల బాలికను ఓ యువకుడు సజీవ దహనం చేశాడు. గురువారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన స్థానికులను తీవ్రంగా కలచివేసింది. కొచ్చిలోని కక్కానాడులో ఉంటున్న బాలిక ఇంటికి వెళ్లిన యువకుడు ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. గమనించిన బాలిక తండ్రి మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. తీవ్రగాయాలతో బాలిక తుదిశ్వాస విడిచింది. ప్రమాదంలో బాలిక తండ్రికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. అతడిని స్థానికులు చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పర్వూర్కు చెందిన మిథున్ అనే యువకుడే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు తెలిపారు. బాలికను సజీవ దహనం చేసిన అనంతరం యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు.
మరిన్ని
జిల్లా వార్తలు

దేవతార్చన
- దిశ హత్య కేసు నిందితుల ఎన్కౌంటర్
- ‘సాహో సజ్జనార్’ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం
- దిశ ఆధారాలపై ‘సూపర్ లైట్’
- జీవచ్ఛవాన్నీ కాల్చేశారు..!
- తెలంగాణ పోలీసులకు సెల్యూట్: సినీ ప్రముఖులు
- పోలీసులపై పూల జల్లు
- నాడు స్వప్నిక.. నేడు దిశ!
- ‘హైదరాబాద్ పోలీసులను చూసి నేర్చుకోవాలి’
- ‘ఆ బుల్లెట్లు దాచుకోవాలని ఉంది’
- ఊరెళ్లి వచ్చేస్తానన్నాడు..