close

ప్ర‌త్యేక క‌థ‌నం

పిల్లల్ని బయటే ఆడుకోనివ్వండి

రోజుకు కనీసం 20 నిమిషాలు కేటాయించండి
ఇలా చేస్తే జబ్బులు, కేన్సర్‌లు రావు
‘ఈనాడు’తో ఎయిమ్స్‌ వైద్యుడు, పద్మశ్రీ గ్రహీత లలిత్‌ కుమార్‌
ఈనాడు - విశాఖపట్నం

భానుడి కిరణాల తాకిడిలో తుళ్లింతలు.. గాలి కెరటాల్లో కేరింతలు, చెట్ల కింద మట్టి గూడుల ఆటలు.. ఇలాంటివి ఈనాటి పిల్లలకు ఎంతమందికి అందుతున్నాయో తెలీదు కానీ.. ఇవి లేక చాలా మందిలో అనేక జబ్బులు వస్తున్నాయన్నది మింగుడు పడని సత్యం.. మేలుకోండి తల్లిదండ్రులూ.. పిల్లల్ని బయటకు వెళ్లనివ్వండి. ఎండలో కాసేపు ఆడుకోనివ్వండి.. బయట గడిపే సమయం ఎంత పెరిగితే అంత మేలు.
 పదేళ్ల క్రితం పాఠశాల వయసు పిల్లల్లో 2.5 శాతం మందికి కేన్సర్‌ ఉండేది. ఇప్పుడా సంఖ్య 5-6 శాతానికి వచ్చింది. రక్త సంబంధ ఇబ్బందులూ అంతకంతకూ పెరుగుతున్నాయి. జీవనశైలిలో ప్రమాదకర మార్పులు రావడమూ ఇందుకు ఓ కారణంగా తెలుస్తోందని అంటున్నారు దిల్లీ ఎయిమ్స్‌ అంకాలజీ విభాగాధిపతి, పద్మశ్రీ అవార్డు గ్రహీత ప్రొఫెసర్‌ లలిత్‌ కుమార్‌. తక్కువ ధరకే మూలకణాలు, ఎముక మజ్జ మార్పిడిలో విప్లవాత్మక మార్పులు తెచ్చారీయన. ఆదివారం విశాఖకు వచ్చిన లలిత్‌కుమార్‌ ‘ఈనాడు’తో మాట్లాడారు.ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
పిల్లల్లో రక్త సంబంధ ఇబ్బందులు సాధారణమైపోయాయి. 10-15 ఏళ్లతో పోల్చి చూస్తే అక్యూట్‌ లింఫోబ్లాస్టిక్‌ లుకేమియా (ఏఎల్‌ఎల్‌) ప్రస్తుతం ఎక్కువగా వస్తున్నట్లు నిర్ధారణ అవుతోంది. ఇది పలు రకాల ఇన్‌ఫెక్షన్ల ద్వారా, రోగ నిరోధక వ్యవస్థ తగ్గడం ద్వారా పిల్లల్లో వృద్ధి చెందడానికి కారణం. ఎలాంటి ఇన్‌ఫెక్షన్ల్ల కారణంగా రక్తంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయనేదీ ఇంకా తేలలేదు.
* గతంలో పిల్లలు బయటే ఆడుకునేవారు. ఇప్పుడు ఫోన్‌లు, బొమ్మలతో ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఈ తరహా అలవాట్లతో వారిలో రోగ నిరోధకశక్తి తగ్గి.. ఇన్‌ఫెక్షన్ల ప్రభావంతో రక్తకణాలు, డీఎన్‌ఏల్లో మార్పులు వస్తున్నాయి. వీటిలోని ప్రమాదకర స్వతంత్ర కణాలు పెరిగి పలు వ్యాధులు వచ్చేలా చేస్తున్నాయి. ఏఎల్‌ఎల్‌ లాంటి కేన్సర్లకూ కారకాలవుతున్నాయి.
* బలహీనంగా ఉన్న పిల్లల్లో అప్లాస్టిక్‌ అనీమియా కనిపిస్తోంది. వీరిలో రక్తం తయారవకపోవడం లాంటి లక్షణాలుంటున్నాయి. దశాబ్దకాలంలో ఇలాంటి పిల్లల సంఖ్య పెరిగిందని నివేదికలు చెబుతున్నాయి.
* రోజుకు కనీసం 15-20 నిమిషాలైనా పిల్లలు పగలు బయట తిరగడం మొదలు పెడితే రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది. తద్వారా ఇన్‌ఫెక్షన్లతో పోరాడేతత్వం వస్తుంది.
* కేన్సర్లను గుర్తించే ఆసుపత్రులు, డయాగ్నస్టిక్‌ సాంకేతికత దేశంలో బాగా పెరిగింది. ప్రజల్లో అక్యూట్‌ లింఫోబ్లాస్టిక్‌ లుకేమియా (ఏఎల్‌ఎల్‌), అక్యూట్‌ మైలోయిడ్‌ లుకేమియా (ఏఎంఎల్‌) కేన్సర్లు బాగా పెరిగాయి. క్షేత్ర స్థాయిలోని ఫిజీషియన్లకూ అవగాహన లేకపోవడంతో జబ్బులు వచ్చేదాకా జనాలకు తెలియని పరిస్థితి ఉంది. ప్రస్తుతం 150 జిల్లాల్లో రొమ్ము కేన్సర్‌పై క్షేత్రస్థాయి సిబ్బందే నిర్ధారణ చేసేలా ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.