close

ప్ర‌త్యేక క‌థ‌నం

మందుబిళ్ల వేస్తే..కొత్త జబ్బులు!

3 వేల రకాల మందులకు రియాక్షన్‌..
రాష్ట్రంలోనే 300 మందులు

దేశవ్యాప్తంగా 3,000 రకాలకు పైగా మందులు రోగులకు రియాక్షన్‌ ఇస్తున్నట్లు సెంట్రల్‌ డ్రగ్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌కు  నివేదికలు అందుతున్నాయి. ఇందులో 300 వరకు ఏపీ నుంచి ఉంటున్నాయి.
ఈనాడు, అమరావతి: ఓ యువతికి ఫిట్స్‌ తగ్గేందుకు ఇచ్చిన మందువల్ల చర్మ సమస్యలు వచ్చాయి. కళ్లు, పెదవులు ఉబ్బాయి. 30 ఏళ్ల వ్యక్తికి టీబీ మందులు వాడగా పసికర్లు, 48 ఏళ్ల వ్యక్తికి నొప్పి నివారణ మందులు వాడగా చర్మంపై నల్లమచ్చలు వచ్చాయి. ప్రాణాధార మందుల విషయంలో రోగుల పాట్లు ఇవి. వ్యాధి తగ్గడానికి వాడుతున్న మందులు ఒక్కోసారి వికటించి మరింత అనారోగ్యానికి గురి చేస్తున్నాయి. మార్కెట్లోకి విడుదల చేసే ముందు మందులను ఔషధ ప్రయోగాల ద్వారా  పరీక్షిస్తున్నా.. శరీరతత్వాన్ని బట్టి కొందరిపై దుష్ప్రభావాన్ని చూపుతున్నాయి. 2018లో కేంద్రం 340 రకాలకుపైగా మందుల వినియోగాన్ని నిషేధించింది. ఔషధ ప్రయోగాల ద్వారా మందుల నాణ్యత, రోగుల స్పందనను అనుసరించి ఉత్పత్తి సంస్థలు తయారు చేస్తున్నాయి. అయినా కొందరికి సమస్యలు వస్తూనే ఉన్నాయి. దేశంలో 270 ఔషధ దుష్ప్రభావ పర్యవేక్షణ కేంద్రాలు ఉండగా ఏపీలో 9, తెలంగాణలో 9 ఉన్నాయి.  గుంటూరు జీజీహెచ్‌ ఓపీ ద్వారా వచ్చిన ఓ రోగికి ఆరునెలల ముందే ఓ మందు వాడినప్పుడు రియాక్షన్‌ వచ్చింది. ఆ విషయాన్ని అతడు వైద్యులకు చెప్పలేదు. మళ్లీ అదే మందు వాడటంతో చర్మంపై నల్లమచ్చలు వచ్చాయి. 25 ఏళ్ల యువకుడికి యాంటీబయాటిక్‌ ఇంజక్షన్‌ ఇవ్వగా శరీరంపై దద్దుర్లు వచ్చాయి. 40 ఏళ్ల మహిళ కండరాల నొప్పికి వాడిన మందులవల్ల వాంతులయ్యాయి. గుంటూరు జీజీహెచ్‌లోని కేంద్రానికి రోజూ 2-3 రియాక్షన్‌ కేసులు వస్తున్నట్లు వైద్యులు తెలిపారు. నెలకు ఇలా 70-80 కేసులు నమోదవుతున్నాయి. రియాక్షన్‌ కేసుల్లో 75% ప్రభుత్వాసుపత్రులు, మిగిలినవి ప్రైవేటు ఆసుపత్రుల ద్వారా వస్తున్నాయి. మొత్తం రియాక్షన్‌ కేసుల్లో 60% చర్మ, 10% ఉదరకోశ సంబంధిత సమస్యలుంటున్నాయి. యాంటీబయాటిక్స్‌ వాడినవారిలోనే ఎక్కువగా రియాక్షన్లు కనిపిస్తున్నాయని వైద్యవర్గాలు అంటున్నాయి.


వైద్యులను సంప్రదించాలి

మందులు వాడినప్పుడు శరీరంలో ఏవైనా మార్పులు గమనిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. అలర్జీకి వాడే మందులవల్ల దడ రావడం లేదా ఉన్న సమస్య పెద్దది కావడం, కుంగుబాటుకు గురయ్యే ఒక మందువల్ల కంటిచూపు మందగించే అవకాశం ఉన్నందున జాగ్రత్తలు తీసుకోవాలని సెంట్రల్‌ డ్రగ్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ ఇటీవల వైద్యులకు సూచించింది.

- ప్రొఫెసర్‌ మీనాకుమారి,
ఫార్మకాలజీ, గుంటూరు జీజీహెచ్‌ కేంద్రం సమన్వయకర్త

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.