close

ప్ర‌త్యేక క‌థ‌నం

వివాదం.. వివాహేతరం

హత్యలకు దారితీస్తున్న తగాదాలు... అనైతిక సంబంధాలు
సగానికి పైగా ఘోరాలకు కారణాలివే
ఈనాడు, అమరావతి

కోపంవల్ల కొన్ని... ‘తాపం’వల్ల మరికొన్ని ఘోరాలు విలువైన ప్రాణాల్ని హరించేస్తున్నాయి. రాష్ట్రంలో జరుగుతున్న హత్యలకు తగాదాలు, వివాహేతర సంబంధాలే ప్రధాన కారణమవుతున్నాయి. భూ, కుటుంబ, నగదు లావాదేవీల్లో తలెత్తే తగాదాలతో కక్షలు, కార్పణ్యాలు పెంచుకుని అవతలి వారిని అంతం చేస్తున్నారు. వరకట్నం, ప్రేమ వ్యవహారాలూ పలువురి ఉసురు తీస్తున్నాయి. 2017లో రాష్ట్రంలో జరిగిన హత్యలను విశ్లేషిస్తే ఈ విషయం వెల్లడైంది. ఆ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 1,054 హత్యకేసులు నమోదు కాగా... ఆ ఘటనల్లో 1,124 మంది హతమయ్యారు.

కుటుంబ తగాదాలవల్ల... 

* వివాదాలవల్ల చోటుచేసుకున్న హత్యలపై రాష్ట్రవ్యాప్తంగా 374 కేసులు నమోదయ్యాయి. వీటిలో 152 హత్యలకు కుటుంబ తగాదాలే కారణం.
* చిన్నగా మొదలైన మాటలు... వాగ్వాదంగా మారి హత్యలకు దారితీసిన సంఘటనలు 94.
* ఆస్తి, భూ తగాదాల్లో ఒకరిపై ఒకరు కక్ష పెంచుకుని... తమ ప్రత్యర్థులను హతమార్చేందుకూ వెనుకాడట్లేదు. ఇలాంటివి 91 ఘటనలు జరిగాయి.
* వివాహేతర సంబంధాలవల్ల 179 హత్యలు చోటు చేసుకున్నాయి.

ఎక్కువ మంది వారే...

* హతుల్లో 779 మంది (69.30 శాతం) 18-45 ఏళ్ల వయోవర్గానికి చెందినవారే. ఉత్పాదకతలో కీలకంగా వ్యవహరించే ఈ వర్గమే అధికంగా హత్యలకు గురవుతోంది.
* 18-60 ఏళ్ల హతుల్లో మహిళల కంటే పురుషులే ఎక్కువ.
* 0-18 ఏళ్ల హతుల్లో బాలల కంటే బాలికలే అధికం.
* హత్యకు గురైన వారిలో 714 మంది పురుషులు, 409 మంది మహిళలు. ఒకరు ట్రాన్స్‌జెండర్‌.

 
 

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.