Latest Telugu News, Headlines - EENADU
close

ప్ర‌త్యేక క‌థ‌నం

14వ అంతస్తుకు 400 టన్నుల వంతెన

కమాండ్‌ కంట్రోల్‌ పనుల్లో ఇంజినీరింగ్‌ ఘనత
పర్యవేక్షించిన ఉన్నతాధికారులు

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: రాష్ట్రప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా బంజారాహిల్స్‌ రోడ్డు నంబరు 12లో చేపడుతున్న కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ కేంద్రం నిర్మాణ పనుల్లో ఇంజినీరింగ్‌ ఘనత ఆవిష్కృతమైంది. దాదాపు 400 టన్నులు ఉన్న స్కై బ్రిడ్జిని 200 అడుగుల ఎత్తులోని 14వ అంతస్తుకు చేర్చి, రెండు హర్మ్యాలకు కలిపే ప్రక్రియను శనివారం డీజీపీ మహేందర్‌రెడ్డి ప్రారంభించారు. ఇంత భారీ బరువున్న వంతెనను అమాంతం ఎత్తి బిగించడం విశేషమని ఇంజినీర్లు అన్నారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలను కల్పించడంతో పాటు..సురక్షితమైన సేవలు, శాంతిభద్రతల పరిరక్షణ కోసం నాలుగేళ్ల క్రితం ఈ కేంద్రం పనులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ శంకుస్థాపన చేయడం విదితమే. నాలుగు టవర్లతో నిర్మితమవుతున్న ఈ కేంద్రంలో ‘ఎ’ టవర్‌ నుంచి ‘డి’ టవర్‌కు వెళ్లేందుకు వీలుగా ఈ ఆకాశ వంతెనను బిగించారు. ఈ ప్రక్రియను డీజీపీతో పాటు హోం శాఖ కార్యదర్శి రాజీవ్‌ త్రివేది, ఆర్‌ అండ్‌ బీ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌, రాచకొండ కమిషనర్‌ మహేష్‌ భగవత్‌, ఇతర పోలీసు ఉన్నతాధికారులు స్వాతిలక్రా, షిఖాగోయల్‌, మురళీకృష్ణ, నాగిరెడ్డి, ఏఆర్‌ శ్రీనివాస్‌, ఎల్‌ఎస్‌ చౌహాన్‌; వివిధ ప్రభుత్వశాఖలవారు దగ్గరుండి వీక్షించారు.

పనులన్నీ త్వరలోనే పూర్తి: డీజీపీ
ఈ కమాండ్‌, కంట్రోల్‌ కేంద్రం పనులు త్వరలో పూర్తవుతాయని డీజీపీ అన్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో ఇదొక కీలక ఘట్టంగా మారుతుందన్నారు. ప్రజలకు భద్రతా భావాన్ని కల్పించడం, రాష్ట్రంలో పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించడం, కిందిస్థాయి అధికారులకు ఎప్పటికప్పుడు సహకారం అందించడంలో ఈ కేంద్రమే కీలకమవుతుందన్నారు.ఇదే సెంటర్‌లో అన్ని సాంకేతికతలను సమ్మిళితం చేయడం వల్ల, వివిధ ప్రభుత్వ సంస్థల ద్వారా ప్రజలకు అందే సేవలను మెరుగుపరచడానికి వీలవుతుందన్నారు. సాంకేతికంగా ఈ కేంద్రం విలక్షణంగా నిలుస్తుందని రహదారులు-భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి  రామకృష్ణారావు అన్నారు. సీపీ అంజనీకుమార్‌ మాట్లాడుతూ, ఈ నిర్మాణం కారణంగా ప్రజలకు మరింత మెరుగైన సేవలు లభిస్తాయన్నారు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.