close

ప్ర‌త్యేక క‌థ‌నం

తెగ తిరుగుతున్నారు!

హైదరాబాద్‌లో రోజుకు సగటు వ్యక్తి ప్రయాణ దూరం 13.25 కి.మీ.
ట్రాఫిక్‌ రద్దీకి అదే కారణం

ప్రజారవాణా విస్తరణపై సర్కారు దృష్టి

ఈనాడు, హైదరాబాద్‌: రాజధాని నగరంలో జనం బాగా తిరిగేస్తున్నారు. వివిధ కారణాలతో ఇంటిపట్టున ఉండడం లేదు. విధుల నిర్వహణ, ఆహారం కోసం, షాపింగ్‌ చేసేందుకు, సేదతీరేందుకు, స్నేహితుల్ని కలవడానికి, ఇతరత్రా కారణాలతో రోడ్డెక్కుతున్నారు. ఫలితంగా మహానగరంలోని పలు రహదారులు కిక్కిరిసిపోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చేయించిన అధ్యయనం ఈ విషయాలను స్పష్టం చేసింది. దీంతో నగర రహదారుల స్వరూపాన్ని పూర్తిగా మార్చేందుకు సర్కారు నడుం బిగించింది. సగటు మనిషి ప్రయాణ దూరాన్ని తగ్గించేందుకు సమాచార సాంకేతిక వ్యవస్థను విస్తరించబోతోంది. ప్రజారవాణా వ్యవస్థను పెద్దయెత్తున అందుబాటులోకి తేచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. హైదరాబాద్‌ మహానగరంలో చాలామంది ప్రజారవాణాకు దూరంగా ఉంటున్నారు. ప్రతి చిన్న అవసరానికి వ్యక్తిగత వాహనాలతో రోడ్లపైకి వస్తున్నారు. ఈ ప్రవర్తనలో మార్పు రావాలని అధ్యయనం సూచిస్తోంది. దానికి తగ్గట్లు జీహెచ్‌ఎంసీ నగరం లోపల వ్యక్తి సగటు ప్రయాణ దూరాన్ని తగ్గించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని స్పష్టం చేస్తోంది. ఆన్‌లైన్‌ షాపింగ్‌, కార్‌ పూలింగ్‌, బైక్‌ షేరింగ్‌ వంటి వాటిని ప్రోత్సహిస్తే రోడ్లపై తిరిగే వాహనాల సంఖ్య కొంత వరకు అదుపులోకి వస్తుందని తెలిపింది. సమాంతరంగా ఎంఎంటీఎస్‌, మెట్రో, బీఆర్‌టీఎస్‌ వంటి ప్రజా రవాణాను అందుబాటులోకి తెస్తే ప్రయోజనం ఉంటుందని పేర్కొంది

ఊతమివ్వనున్న ఎస్సార్డీపీ పనులు 
- జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఎం.దానకిశోర్‌

గర రహదారి వ్యవస్థను అత్యాధునికంగా తీర్చిదిద్దటానికి రాష్ట్ర ప్రభుత్వం పలు రకాల ప్రజా రవాణా వ్యవస్థలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రతిపాదనలు తయారు చేస్తోందని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఎం.దానకిశోర్‌ తెలిపారు. వాటి ప్రకారం 2041 నాటికి మెట్రో మార్గం 417 కి.మీ., బీఆర్‌టీఎస్‌ మార్గం 438 కి.మీ., ఎంఎంటీఎస్‌ వ్యవస్థ 428 కి.మీ.ల పొడవున అందుబాటులోకి రానుందని చెప్పారు. ఇందుకు ఇప్పటికే రూ.25 వేల కోట్ల అంచనా వ్యయంతో మొదలైన స్ట్రాటజిక్‌ రోడ్‌ డెవలప్‌మెంట్‌ ప్లాన్‌- (ఎస్సార్డీపీ) పనులు కొనసాతున్నాయని వివరించారు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.