Latest Telugu News, Headlines - EENADU
close

ప్ర‌త్యేక క‌థ‌నం

నదీమతల్లి.. పొంగిపొర్లి..

రిజర్వాయర్లలో పదేళ్ల కంటే ఎక్కువ నీటి లభ్యత 
64 శాతం నీటి నిల్వలు 
దేశ వ్యాప్తంగా ఈ నెల వర్షాలతో మెరుగుపడిన పరిస్థితి

దేశంలోని అనేక రిజర్వాయర్లు నీటితో కళకళలాడుతున్నాయి. గత ఏడాది ఇదే సమయం కంటే, గత పదేళ్ల సరాసరి కంటే కూడా ఈ సంవత్సరం ఎక్కువ నీటి లభ్యత ఉంది. ఖరీఫ్‌ ప్రారంభమైన మొదటి రెండు నెలలు నిరాశాజనకంగా ఉన్నా, ఆగస్టులో కురిసిన భారీ వర్షాలతో పరిస్థితి గణనీయంగా మెరుగుపడింది. రిజర్వాయర్లలో నీటి వినియోగ సామర్థ్యంలో  64 శాతం నిల్వలున్నాయి. సబర్మతి మినహా మిగిలిన అన్ని నదుల్లో సాధారణం కంటే ఎక్కువగా నిల్వలు ఉన్నట్లు కేంద్ర జలసంఘం పేర్కొంది. కొన్ని నదులకు భారీ వరద ఉన్నా, ఆ నదుల్లోని కొన్ని రిజర్వాయర్లలో తగినంత నీటి లభ్యత లేదు. దక్షిణాదిలో గోదావరి ఈ స్థితిలో ఉంది. 

దేశవ్యాప్తంగా 107 రిజర్వాయర్లు కేంద్ర జలసంఘం పర్యవేక్షణలో ఉన్నాయి. వారానికి ఒకసారి ఈ రిజర్వాయర్లలో నీటి నిల్వలను జలసంఘం విశ్లేషిస్తుంది. జులై 25 నాటికి 25 శాతం నీటి నిల్వలు కూడా లేకపోగా, ఆగస్టు 14 నాటికి 64 శాతం నిల్వలున్నట్లు కేంద్ర జలసంఘం నివేదిక వెల్లడించింది. ఈ 107 రిజర్వాయర్లలోని వినియోగ నీటి నిల్వ సామర్థ్యం 5868.12 టీఎంసీలు. దేశం మొత్తమ్మీద అన్ని రిజర్వాయర్లలో ఉన్న నిల్వ సామర్థ్యంలో ఇది 64.45 శాతం. ఈ రిజర్వాయర్లలో 5868.12 టీ¨ఎంసీలకు గాను 3767.15 టీ¨ఎంసీలు, అంటే 64 శాతం నిల్వ ఉంది. ఇది గత సంవత్సరం ఇదే సమయంతో పోల్చితే 125 శాతం, గత పదేళ్ల సగటుతో పోల్చితే 122 శాతం. గత పదేళ్లతో పోల్చితే ఈ సంవత్సరం పరిస్థితి బాగా మెరుగ్గా ఉన్నట్లు జలసంఘం నివేదికనుబట్టి స్పష్టమవుతుంది.

మెరుగ్గా జల విద్యుదుత్పత్తి 
జలసంఘం పర్యవేక్షించే 107 రిజర్వాయర్లకుగాను 60 మెగావాట్ల కంటే ఎక్కువ సామర్థ్యం గల జల విద్యుదుత్పత్తి కేంద్రాలు 39 ఉన్నాయి. రిజర్వాయర్లలో నీటి నిల్వలు బాగా ఉండటం వల్ల జలవిద్యుదుత్పత్తి కూడా మెరుగ్గా ఉంది. సింధు, నర్మద, తాపి, మహి, గోదావరి, కృష్ణా, కావేరి, దక్షిణాదిలో పశ్చిమ కనుమల నుంచి ప్రవహించే నదులు, గంగ, మహానది ఇలా అన్నీ సాధారణ పరిస్థితికి తగ్గట్లుగానే ఉండగా, సబర్మతిలో మాత్రం ఎక్కువ లోటు ఉంది.

గేట్లు మూస్తే మరింత నిల్వ

ఈ రిజర్వాయర్లలో గత రెండు వారాల్లోనే 900 టీఎంసీల నిల్వ పెరిగింది. వరద ఎక్కువగా ఉండి పూర్తి స్థాయిలో నిల్వ చేయడం లేదు. వరద తగ్గు ముఖం పట్టి గేట్లు మూస్తే రిజర్వాయర్లలో నీటినిల్వలు ఇంకా పెరుగుతాయి.

 

 

 

 

 

 
 
 
 

 
 

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.