Latest Telugu News, Headlines - EENADU
close

ప్ర‌త్యేక క‌థ‌నం

తప్పాలంటే విలయం దాటాలి వలయం

అవుటర్‌ చుట్టూ 13 నగరాలు ఏర్పాటు చేయాలన్న నిపుణులు 
ఈ ప్రతిపాదనల్లో ఒక్క కోకాపేటలోనే కదలిక 
నివేదిక దుమ్ము దులిపితేనే ప్రయోజనం 
ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి

దేశంలోనే అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం హైదరాబాద్‌. ఇక్కడ అభివృద్ధి అంతా కొన్ని ప్రాంతాలకే పరిమితం కావడంతో భవిష్యత్తులో తీవ్రమైన ట్రాఫిక్‌ సమస్యలతో పాటు జనజీవనానికి ఎంతో ఇబ్బంది తలెత్తనుంది. బాహ్యవలయ రహదారి చుట్టూ (ఓఆర్‌ఆర్‌) 13 నగరాలను ఏర్పాటు చేస్తే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ)  కొన్నేళ్ల కిందటే నివేదికను రూపొందించింది. ఈ నివేదిక బుట్టదాఖలైంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అవుటర్‌ చుట్టూ చిన్న నగరాల దిశగా చర్యలు తీసుకోవాలని నిపుణులు కోరుతున్నారు.

మరిప్పుడు ఏం చేయాలి? 
బాహ్యవలయ రహదారికి రెండు వైపులా.. దాదాపు 50 వేల ఎకరాల ప్రైవేటు భూమి ఉంది. అవుటర్‌కు ఆనుకుని ఉండే సర్వీస్‌ రోడ్డులోకి రావడానికి వీలుగా గ్రిడ్‌ రోడ్లు లేకపోవడంతో ఈ భూమి కొన్నేళ్లుగా అభివృద్ధి చెందడం లేదు. ఈ భూమిని వినియోగంలోకి తెచ్చి అవుటర్‌ చుట్టూ 13 నగరాలు ఏర్పాటు చేస్తే రాజధాని విస్తరిస్తుందని హెచ్‌ఎండీఏ తేల్చింది. మొత్తం 121 గ్రామాలలో 2,800 హెక్టార్ల పరిధిలో ఏర్పాటు చేయడానికి అవకాశం ఉందని వివరించింది. మౌలిక సదుపాయాలకు 6,732 కోట్లు అవుతుందని అంచనా వేసింది. ఒక్కో నగరాన్ని ఒక్కో ప్రత్యేక హబ్‌గా తయారు చేసి అక్కడ పరిశ్రమల ఏర్పాటుతోపాటు అన్ని సౌకర్యాలతోకూడిన నివాస ప్రాంతాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. కోకాపేట మినహా మిగిలిన వాటి విషయంలో ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. 
హైదరాబాద్‌ గ్రేటర్‌పరిధి జనాభా దాదాపు కోటి. 
ప్రస్తుతం ఉన్న భవనాల సంఖ్య 20 లక్షలు. అందులో 3.50 లక్షలు మినహా మిగిలినవన్నీ నివాస భవనాలే. 
* ఏటా జీహెచ్‌ఎంసీ 18 వేల భవన నిర్మాణాలకు  అనుమతిస్తోంది. మరో నాలుగైదు వేల భవనాల అక్రమ నిర్మాణం జరిగిపోతూనే ఉంది. 
రానున్న రెండు దశాబ్దాల్లో గ్రేటర్‌లో జనాభా 2 కోట్లకు పైబడి పెరిగిపోతుందని అంచనా. 
గ్రేటర్‌ పరిధిలో వాహనాల సంఖ్య 61 లక్షలు. దీంతో ట్రాఫిక్‌ నరకయాతన మొదలైంది.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.