close

ప్ర‌త్యేక క‌థ‌నం

దూరమైనా ..చేరువే 

దూరమైనా ..చేరువే 

దూరాలు దగ్గరయ్యాయి.. గంటలు నిముషాలయ్యాయి.. ట్రాఫిక్‌ కష్టాలు మాయమయ్యాయి.. ఉదయం లేవగానే ప్రయాణానికి ఉరుకులు పరుగులు అక్కర్లేదిక. 
సాయంత్రమైతే.. ఆఫీస్‌లో అలసిపోయి, ట్రాఫిక్‌లో విసిగిపోయి ఈసురోమంటూ ఇంటికొచ్చే ఉద్యోగులు ఇప్పుడు చిరునవ్వుతో గూటికి చేరుతున్నారు. 
రోడ్లమీద పడిగాపులు తగ్గి, కుటుంబంతో గడిపే సమయం పెరిగింది.. హైదరాబాద్‌ నగరవాసి నిత్యజీవితంలో ఇంత మార్పు తెచ్చింది మెట్రో రైలు. 
దూరాలను దగ్గర చేస్తూ.. కాలుష్యాన్ని, రద్దీని దూరం చేస్తూ ముందుకు సాగుతోంది. ఎల్బీనగర్‌ నుంచి అమీర్‌పేట వరకూ మెట్రో మార్గం గత నెలలో ప్రారంభమవడంతో నగరంలో అత్యంత రద్దీ మార్గంలో వాహనదారుల కష్టాలకు చాలావరకు తెరపడినట్లే.

ప్రయాణం సులువు.. జీవనం మెరుగు 
హైదరాబాద్‌లో మెట్రో తెచ్చిన మార్పు 
వాహనాలు వదిలి మెట్రోలో కదులుతున్న ప్రజలు 
ట్రాఫిక్‌ అవస్థలకు సెలవు 
పనిగంటలు ఆదా 
స్టేషన్ల సమీపంలో నివాసానికి ఆసక్తి 
ఈనాడు - హైదరాబాద్‌ 

దూరమైనా ..చేరువే 

హైదరాబాద్‌ మెట్రో రైలు రాకతో నగరవాసి రోజువారీ జీవనంలో గణనీయమైన మార్పులు కనిపిస్తున్నాయి. గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకునే ఇబ్బందుల నుంచి నగర ప్రయాణికులకు మెట్రో పెద్ద ఊరట. దీంతో విద్యార్థులు, ఉద్యోగులు, పర్యాటకులు, మహిళలు, పెద్దల నుంచి మెట్రోకు మంచి ఆదరణ లభిస్తోంది. రెండు మార్గాల్లోని 46 కి.మీ. మార్గంలో నిత్యం సగటున లక్షన్నర మంది ప్రయాణిస్తున్నారు. ఉదయం, సాయంత్రం కార్యాలయాల వేళ్లల్లో మెట్రో రైళ్లు రద్దీగా ఉంటున్నాయి. ప్రయాణికుల సౌకర్యం కోసం ఈ సమయంలో ఆరున్నర నిమిషాలకు ఒక మెట్రో నడుపుతున్నారు. రద్దీని తట్టుకునేందుకు అవసరమైన సమయంలో మధ్యలోని స్టేషన్ల నుంచి మూడున్నర నిమిషాలకు ఒకటి నడుపుతున్నారు.

దూరమైనా ..చేరువే  

దూరమైనా ..చేరువే 

అత్యంత రద్దీ మార్గంలో సౌకర్యం 
దూరమైనా ..చేరువే 

నగరంలో అత్యంత రద్దీగా ఉండే 65వ నెంబర్‌ జాతీయ రహదారి ఎల్బీనగర్‌ మీదుగా మియాపూర్‌ వెళుతుంది. హైదరాబాద్‌కు ఇదే ప్రధాన రహదారి. రాజధానిలో తూర్పు, పశ్చిమ ప్రాంతాలను అనుసంధానం చేసే ఈ మార్గం వాహనాలతో పద్మవ్యూహాన్ని తలపిస్తుంది. సరిపడా బస్సులు లేక ఈ మార్గంలో బస్సులన్నీ కిటకిటే. దీంతో ఇన్నాళ్లు ఎక్కువమంది ఉద్యోగులు సొంత వాహనాలపై కార్యాలయాలకు వెళ్లేవారు. ఫలితంగా కొన్ని ప్రధాన కూడళ్లలో గంటకు 50 వేల వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. కారిడ    ార్‌-1 మియాపూర్‌ నుంచి ఎల్‌బీనగర్‌ వరకు మెట్రో రైలు అందుబాటులోకి రావడంతో వాహనదారులు క్రమంగా మెట్రో వైపు మొగ్గుచూపుతున్నారు. ఉద్యోగులే కాదు విద్యార్థులు, షాపింగ్‌కు వెళ్లేవారు, ఇతరత్రా అవసరాల కోసం ప్రధాన నగరానికి వచ్చేవారు మెట్రోను వినియోగిస్తున్నారు.

రద్దీ ఎక్కువ ఉన్న స్టేషన్లు 
దూరమైనా ..చేరువే 

అమీర్‌పేట, ఎల్‌బీనగర్‌, మియాపూర్‌, కేపీహెచ్‌బీ, జేఎన్‌టీయూ, దిల్‌సుఖ్‌నగర్‌, బేగంపేట, సికింద్రాబాద్‌, లక్డీకాపూల్‌

సమీప స్టేషన్ల నుంచి.. 
దూరమైనా ..చేరువే 

రోజు ప్రయాణించేవారే కాదు అప్పుడప్పుడు వెళ్లేవారు, పర్యాటకులకు, దూరప్రాంతాలకు వెళ్లేవారికి మెట్రో ఎంతో సౌకర్యంగా ఉంది. నాంపల్లి, సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్లకు, మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌ (ఎంజీబీఎస్‌), మలక్‌పేట, లక్డీకాపూల్‌, ఖైరతాబాద్‌, భరత్‌నగర్‌, బేగంపేట ఎంఎంటీఎస్‌ స్టేషన్లకు అనుసంధానం ఉండటంతో ఇక్కడి వరకు మెట్రోలో చేరుకుని అక్కడి నుంచి ప్రైవేటు వాహనాల్లో గమ్యస్థానానికి వెళుతున్నారు. రామోజీ ఫిల్మ్‌సిటీకి వెళ్లే పర్యాటకుల కోసం నాగోల్‌, ఎల్‌బీనగర్‌ స్టేషన్లకు చేరుకుంటే చాలు అక్కడి నుంచి ఉదయం వేళ పర్యాటక బస్సులు నడుపుతున్నారు. రాత్రివేళ దూర ప్రాంతాలకు వెళ్లే బస్సులను మెట్రో స్టేషన్లకు అనుసంధానంగా నడుపుతున్నారు.

నివాసాలకు మొగ్గు

మెట్రో మార్గాల్లో స్టేషన్లకు సమీపంలో ఎక్కువగా నివాసం ఉండేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో అక్కడ అద్దె ఇళ్లకు గిరాకీ పెరిగింది. గత నవంబరులో మెట్రో రైలు ప్రాంభమైన తర్వాత మియాపూర్‌- నాగోల్‌ మార్గంలోనూ, తాజాగా ఎల్‌బీనగర్‌- అమీర్‌పేట అందుబాటులోకి వచ్చాక ఈ మార్గంలోనూ ఇళ్ల అద్దెలపై మెట్రో ప్రభావం కన్పిస్తోంది. స్టేషన్లకు సమీపంలో ఉన్న ఇళ్ల అద్దెలు ముఖ్యంగా దిల్‌సుఖ్‌నగర్‌, చైతన్యపురి ప్రాంతాల్లోని కాలనీల్లో పెరుగుదల ఎక్కువగా ఉంది. మెట్రో రైలు నడుస్తున్న మార్గాల్లో స్థలాలు, కొత్త ఫ్లాట్ల ధరలు పెరిగాయి.

పెట్రో ధర పెరుగుదలతో.. 
దూరమైనా ..చేరువే 

మెట్రో టికెట్‌ ధర ఎక్కువగా ఉందని ప్రయాణికులు మొదట్లో వెనకంజ వేశారు. అయితే ఇప్పుడు పెట్రోలు ధరలు భారీగా పెరగడంతో వాహనచోదకులు మళ్లీ మెట్రో వైపు చూడడం మొదలుపెట్టారు. దానికితోడు ఎల్బీనగర్‌ -మియాపూర్‌ ప్రధాన మార్గం అందుబాటులోకి రావడం ప్రయాణికుల సంఖ్య పెరగడానికి కారణం.

రవాణా ఆధారిత అభివృద్ధి 
దూరమైనా ..చేరువే 

మెట్రో రాకతో ఆయా మార్గాల్లో రవాణా ఆధారిత అభివృద్ధి ఊపందుకోనుంది. మెట్రో ప్రాజెక్ట్‌లో భాగంగా ఎల్‌ అండ్‌ టీకి కేటాయించిన స్థలాల్లో నాలుగు చోట్ల మాల్స్‌ను నిర్మించింది. ఇప్పటికే మాదాపూర్‌, పంజాగుట్ట పూర్తిగా అందుబాటులోకి వచ్చాయి. ఇంటిదగ్గర మెట్రో ఎక్కి ఆయా మాల్స్‌ ఉన్న స్టేషన్‌లో దిగి నేరుగా మాల్స్‌లోకి వెళుతున్నారు. రహదారిపైకి రావాల్సిన అవసరం కూడా లేకుండానే షాపింగ్‌ పూర్తవుతోంది. అక్కడే మల్టీఫ్లెక్స్‌లు, ఆహారశాలలు, చిల్లర దుకాణాలు, గేమ్స్‌ ఉండటంతో సరదాగా గడిపి వెళుతున్నారు. ఇదే మాదిరి మెట్రో మార్గాల్లో స్టేషన్‌కు అరకిలోమీటరు దూరం వరకు కార్యాలయాలు, రిటైల్‌ దుకాణాలకు డిమాండ్‌ పెరిగింది. మెట్రోతో రవాణా సౌకర్యం మెరుగ్గా ఉండటంతో ఇక్కడ పనిచేసేందుకు ఉద్యోగులు ఇష్టపడుతున్నారు. ఉప్పల్‌ ఐటీ సెజ్‌లో పనిచేసేందుకు ఇదివరకు ఉద్యోగులు పెద్దగా ఆసక్తిచూపేవారు కాదు. ఉప్పల్‌, స్టేడియం స్టేషన్లకు సమీపంలో కార్యాలయం ఉండటంతో ఇప్పుడు పెద్దగా అభ్యంతర పెట్టడం లేదు. దీంతో సెజ్‌కు డిమాండ్‌ పెరిగింది.

ప్రజా స్థలాలు వినియోగంలోకి.. 
దూరమైనా ..చేరువే 

మెట్రో స్టేషన్ల చుట్టుపక్కలున్న ఖాళీ ప్రభుత్వ స్థలాలను సుందరంగా అభివృద్ధి చేయడంతో నగర ప్రజలు అక్కడ గడిపేందుకు ఇష్టపడుతున్నారు. మియాపూర్‌లో స్టేషన్‌ సమీపంలో రోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో పిల్లలతో సరదాగా గడిపేందుకు వస్తున్నారు. పెద్దలు ఇక్కడ సేదదీరుతున్నారు. ప్రతి స్టేషన్‌ ప్రాంగణంలోనూ అటు ఇటూ కలిపి 600 మీటర్ల దూరం వరకు పాదచారుల బాటలు అభివృద్ధి చేస్తుండటంతో ఉదయం, సాయంత్రం వేళల్లో కేవలం నడక కోసం కూడా చాలామంది వస్తున్నారు.
దూరమైనా ..చేరువే మియాపూర్‌లో ఉండే సాకేత్‌ అమీర్‌పేటలోని ఫిట్జీ వరల్డ్‌ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. రోజూ స్కూల్‌ బస్సులో వెళ్లేవాడు. ఉదయం 7.30 గంటలకే ఇంటి నుంచి బయలుదేరేవాడు. సాయంత్రం 4.45కు బయటికి వస్తే పాఠశాల బస్సులో ఇంటికి చేరేసరికి 6.45 అయ్యేది. ఒక్కోసారి 7 గంటలు దాటేది. ఈ మార్గంలో మెట్రో రైలు రాకతో సాకేత్‌ ఇప్పుడు ఇంటి నుంచి ఉదయం 8.15 గంటలకు బయలుదేరుతున్నాడు. సాయంత్రం 5.30 గంటలకల్లా ఇంట్లో ఉంటున్నాడు. రెండు గంటల సమయం ఆదా అవుతోంది. ఈ సమయాన్ని చదువుకునేందుకు కేటాయిస్తున్నానన్నాడు సాకేత్‌. అంతేకాదు బస్సు కోసం ఇది వరకు నాన్న నెలకు రూ.3700 చెల్లించేవారని, ఇప్పుడు రూ.2 వేల లోపే అయిపోతుందని చెప్పాడు.
సుబ్రహ్మణ్యం బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 1లోని ఒక షోరూంలో ఉద్యోగి. చింతల్‌కుంటలోని తన నివాసం నుంచి రోజూ ద్విచక్రవాహనంపై వచ్చేవారు. గంటా 20 నిమిషాలు పైగా పట్టేది. ట్రాఫిక్‌ రద్దీ ఉంటే గంటన్నర. ఇప్పుడు వాహనాన్ని ఎల్‌బీనగర్‌ మెట్రోస్టేషన్‌ దగ్గర నిలిపి మెట్రోలో పంజాగుట్ట వరకు వెళుతున్నారు. అక్కడి నుంచి కాలినడకన షోరూమ్‌కు చేరుకుంటున్నారు. ఇదంతా 50 నిమిషాల్లోపే. అరగంట సమయం ఆదా. ట్రాఫిక్‌ బాధలు, కాలుష్యం బారినపడకుండా విధులకు హాజరవుతున్నారు.
దూరమైనా ..చేరువే కేపీహెచ్‌బీలో ఉంటున్న సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ శ్రావణి వారాంతంలో షాపింగ్‌ కోసం పంజాగుట్ట వస్తుంటారు. ‘బస్సులో చాలా సమయం పట్టేది. పంజాగుట్టలో సరైన బస్‌స్టాప్‌ లేదు. దూరంగా ఉన్న బస్‌స్టాప్‌ నుంచి ట్రాఫిక్‌లో మాల్స్‌ వరకు చేరుకోవడం కష్టంగా ఉండేది. మెట్రోలో 20 నిమిషాల్లో వస్తున్నాను. మెట్రో స్టేషన్‌ పక్కనే మాల్స్‌ కూడా ఉండటంతో రోడ్డుమీదకు వెళ్లాల్సిన అవసరమే లేదు. మహిళలకు మెట్రో చాలా సురక్షితంగా, సౌకర్యంగా అన్పిస్తోంది. మహిళలకు సగం కోచ్‌ ప్రత్యేకించారు. పూర్తి కోచ్‌ ఉంటే ఇంకా బాగుంటుంది’ అని శ్రావణి అన్నారు.
ఎస్‌ఆర్‌నగర్‌ నివాసి సాయి ప్రైవేట్‌ ఉద్యోగి. విధి నిర్వహణకు రోజూ నానక్‌రాంగూడ వెళుతుంటారు. ఉదయం పూట అమీర్‌పేటలో బస్సు కోసం యుద్ధాలే చేయాల్సి వచ్చేది. గచ్చిబౌలి వేవ్‌రాక్‌ వెళ్లే బస్సు ఎక్కేందుకు చోటు కూడా దొరికేది కాదు. ఇప్పుడు ఎస్‌ఆర్‌నగర్‌లో మెట్రో ఎక్కి భరత్‌నగర్‌ స్టేషన్‌లో దిగుతున్నారు. అక్కడ నుంచి ఎంఎంటీఎస్‌లో హైటెక్‌సిటీ చేరుకుంటున్నారు. అక్కడ సంస్థ వాహనంలో కార్యాలయానికి వెళుతున్నారు. దాదాపు ఒకే సమయం పడుతున్నా.. కనీసం సౌకర్యంగా నిలబడి అయినా చేరుకునేందుకు మెట్రో ఉపయోగపడుతోంది అంటున్నారు సాయి. హైటెక్‌సిటీ వరకు మెట్రో వస్తే తన ప్రయాణ కష్టాలు తీరిపోయినట్లేనని చెబుతున్నారు.
దూరమైనా ..చేరువే కోర్టులో పనిచేసే రాజు దివ్యాంగుడు. రోజూ తార్నాక నుంచి కూకట్‌పల్లి వరకు బస్సులో వెళ్లేవారు. ప్రయాణం ఉచితం. అయినా నిత్యం మెట్రోలో వెళుతున్నారు. రహదారిపై నుంచి మెట్రో ఎక్కడం వరకు లిఫ్ట్‌తో సౌకర్యం ఉంది. పైగా వీరికి ప్రత్యేకంగా కేటాయించిన సీట్లు ఉన్నాయి. ‘సౌకర్యంగా ఉండటమే కాదు త్వరగా గమ్యస్థానం చేరుకునే అవకాశం ఉండడంతో డబ్బులు చెల్లించి మెట్రోలో వెళుతున్నా. దివ్యాంగులకు రాయితీ ఇస్తే బాగుంటుంది’ అని రాజు అన్నారు.

నాణ్యమైన జీవితం గడిపేలా..

నగరాల్లో వాహన కాలుష్యం పెరిగి నివసించలేని స్థితికి చేరుకుంటే తర్వాత మార్చడం కష్టం. ఆ పరిస్థితి రాకముందే మేలుకోవాలి. మెట్రో రాకతో ప్రజల జీవనశైలిలో చాలా మార్పులు వచ్చాయి. ద్విచక్రవాహనాలు వదిలి ఎక్కువ మంది మెట్రోలో ప్రయాణిస్తున్నారు. కారు వాడేవారూ క్రమంగా ఇటువైపు వస్తున్నారు. మెట్రో మొత్తం పూర్తయి, స్టేషన్ల నుంచి గమ్యస్థానం చేరుకునే సౌకర్యాలు మెరుగైతే అంతర్జాతీయ నగరాల స్థాయిలో నాణ్యమైన జీవితం హైదరాబాద్‌లోనూ అనుభవంలోకి వస్తుంది.
- ఎన్వీఎస్‌రెడ్డి, ఎండీ, హైదరాబాద్‌ మెట్రోరైలు

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.