close

ప్ర‌త్యేక క‌థ‌నం

శబరిమల ఏమీ పర్యాటక ప్రదేశం కాదు

కాంగ్రెస్‌ నేత రమేష్‌ చెన్నితల

శబరిమల ఏమీ పర్యాటక ప్రదేశం కాదు

తిరువనంతపురం: శబరిమల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను కేరళ ప్రభుత్వం అమలు చేయడంపై ప్రతిపక్ష కాంగ్రెస్‌ నేత రమేష్‌ చెన్నితల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కొంతమంది భక్తులు పబ్లిసిటీ కోసం ఆలయంలోకి ప్రవేశించాలని ప్రయత్నిస్తున్నట్లు ఆయన ఆరోపించారు. శబరిమల ఏమీ పర్యాటక ప్రదేశం కాదని, అక్కడ కేవలం భక్తులకు మాత్రమే అనుమతి ఉంటుందని ఆయన అన్నారు.

‘గవర్నర్‌ని‌ కలిసి శబరిమలలో నెలకొన్న పరిస్థితి గురించి వివరిస్తాం. హిందువులే కాకుండా అన్ని వర్గాలకు చెందిన ప్రజలు శబరిమల వెళ్తున్నారు. ప్రస్తుత పరిస్థితులను చూసి అందరూ ఆందోళన చెందుతున్నారు. మహిళా కార్యకర్త రీహనా ఫాతిమాకు పోలీస్‌ యూనిఫాం ఇచ్చారు. ఆమె ఆలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. ఇది చాలా తప్పు. శబరిమల ఏమీ పర్యాటక ప్రదేశం కాదు. అక్కడికి కేవలం భక్తులు మాత్రమే వెళ్తారు. ప్రస్తుతం కేరళ పోలీసులు అనుసరిస్తున్న తీరు సరైనది కాదు. ఎటువంటి ఆందోళనలకు దిగొద్దని మేం భక్తులతో మాట్లాడతాం’ అని రమేష్‌ అన్నారు.

సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 10-50ఏళ్ల లోపు మహిళలను ఆలయంలోకి ప్రవేశించాలని తిరువనంతపురానికి చెందిన 46ఏళ్ల భక్తురాలు ఆందోళనకారులను కోరారు. దీంతో ఆందోళనకారులు ఆమె ఇంటిని చుట్టుముట్టి వ్యతిరేకంగా నిరసనలు చేశారు. ఆమె ఇంటిని తగులబెట్టేందుకు ప్రయత్నించారు. కొచ్చిలోనూ ఇదే విధంగా సుప్రీం తీర్పుకు మద్దతు ఇచ్చిన ఓ మహిళా భక్తురాలి ఇంటిని ఆందోళనకారులు ధ్వంసం చేశారు. శుక్రవారం శబరిమల ఆలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన పాత్రికేయురాలు కవితా జక్కల్‌, మహిళా కార్యకర్త రీహనా ఫాతిమాలను ఆందోళనకారులు బలవంతంగా వెనక్కి పంపించారు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999 - 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions | Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.