close

ప్ర‌త్యేక క‌థ‌నం

ఓటడిగే తీరు వేరయా 

ఓటడిగే తీరు వేరయా  
నెట్టింట ఒకలా... 

పల్లెల్లో మరోలా.. 
ఓటడిగే తీరు వేరయా 

తెలంగాణలో ఈ దఫా శాసనసభ ఎన్నికల ప్రచారం విలక్షణంగా సాగుతోంది. ఓ వైపు సామాజిక మీడియా వేదికగా అభ్యర్థులు ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. ఫేస్‌బుక్‌, ట్విటర్‌, వాట్సాప్‌, య్యూట్యూబ్‌ వంటివాటిని విరివిగా వినియోగిస్తూ దూసుకుపోతున్నారు. అదే సమయంలో పల్లెల్లో ఉన్నవారికి చేరువ కావడమే లక్ష్యంగా గ్రామాల్లో కరపత్రాలు పంచడం, పండగల ఖర్చు భరించడం, మహిళలతో ప్రచారం, గ్రామ పెద్ద సాక్షిగా ఒట్టు వేయించుకోవడం వంటివి చేస్తున్నారు. విధానమేదైనా విజయం సాధించడమే లక్ష్యంగా ఏ ఒక్క అవకాశాన్నీ వదలడం లేదు. ఓటరన్నను ప్రసన్నం చేసుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. అవసరమైతే ఎంత డబ్బు కుమ్మరించడానికైనా వెనుకాడడం లేదు. గ్రామాల్లో కాస్తంత పట్టున్నవారు ఇదే అదునుగా రారాజులుగా వెలిగిపోతున్నారు.

ఓటడిగే తీరు వేరయా 


ఈ-దూకుడు.. సాటెవ్వరు 
సామాజిక మాధ్యమాల్లో నేతల విస్తృత ప్రచారం 
ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, యూట్యూబ్‌, ట్విటర్‌లో వీడియోలు 
ఈనాడు - హైదరాబాద్‌

సామాజిక మాధ్యమాల వేదికగా రాష్ట్రంలో రాజకీయ ఎన్నికల సమరాంగణం కొనసాగుతోంది. గతానికి భిన్నంగా ఎక్కువగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని ఓటర్లకు చేరువవడానికి అభ్యర్థులు ప్రయత్నిస్తున్నారు. సామాజిక అనుసంధాన వేదికలు, మెసేజింగ్‌ యాప్‌లపై ఆధారపడుతున్నారు. తాను చేసిన అభివృద్ధిని వివరించడానికైనా, ప్రత్యర్థిపై దుమ్మెత్తిపోయడానికైనా లేక తమ హామీలు తెలియజేసేందుకైనా.. సామాజిక మీడియానే వినియోగిస్తున్నారు. ఇందుకోసం ఫేస్‌బుక్‌, ట్విటర్‌, యూట్యూబ్‌, వాట్సాప్‌ వంటివాటిపై ఆధారపడుతున్నారు. పార్టీల కేంద్ర కార్యాలయం నుంచి నియోజకవర్గంలో పోటీచేసే అభ్యర్థి వరకు ఇదే పరిస్థితి. గ్రామాలు, మండల స్థాయిలో వాట్సాప్‌ గ్రూపుల మధ్య అనుసంధానకర్తలుగా నియోజకవర్గ నేతలు వ్యవహరిస్తున్నారు. సామాజిక మీడియా ప్రచారం కోసం ప్రధాన రాజకీయ పార్టీలు ప్రత్యేక బృందాలను నియమించుకున్నాయి. కీలక అభ్యర్థులు సైతం అదే బాటలో పయనిస్తున్నారు. ఈ బృందాలే ప్రచారానికి అవసరమైన ఆయుధాలను సమకూర్చుతున్నాయి.  ఎన్నికల ప్రచారంలో కుల సంఘాల వాట్సాప్‌ గ్రూపులు ప్రచార వేదికలుగా మారాయి. నియోజకవర్గంలో పోటీచేసే అభ్యర్థి తమ కులానికి చెందిన వ్యక్తి అయితే చాలు అండగా నిలుస్తున్నాయి. ఇతర నియోజకవర్గాల్లో పోటీచేస్తున్నా.. వారికి సహాయం చేసేందుకు అక్కడి కుల సంఘం గ్రూప్‌ల అడ్మిన్‌లకు అనుకూలంగా అవసరమైన సమాచారాన్ని వేరే గ్రూప్‌లలోని వారు చేరవేస్తున్నారు. ఓ సామాజిక వర్గానికి చెందిన నేత ఒక వ్యాఖ్యను ఫేస్‌బుక్‌, ట్విటర్‌, వాట్సాప్‌లో పెడితే చాలు ఆ సమాచారాన్ని షేర్‌ చేస్తున్నారు. కొందరు వాట్సాప్‌లో స్టేటస్‌గా పెట్టుకుంటున్నారు. తమ కులానికి చెందిన వ్యక్తిని విమర్శిస్తే అదేస్థాయిలో ప్రతివిమర్శలు చేస్తున్నారు.

పార్టీల వారీగా...  
తెరాస

ఓటడిగే తీరు వేరయా తెరాస సిట్టింగ్‌లను అభ్యర్థులుగా ప్రకటించడంతో ప్రచారానికి సామాజిక మీడియాను విస్తృతంగా వాడుకుంటున్నారు. ప్రభుత్వ పథకాలు, సాధించిన ప్రగతి, సీఎం హామీలు, గత సభల్లో ముఖ్యమంత్రి, మంత్రుల కీలక ప్రసంగాలు, ప్రతిపక్షాలపై విమర్శలను పోస్ట్‌ చేస్తున్నారు. ఇప్పటికే పాక్షిక ఎన్నికల ప్రణాళిక (మేనిఫెస్టో) ప్రకటించడంతో అందులోని హామీలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళుతున్నారు.

మహాకూటమిఓటడిగే తీరు వేరయా 

మహాకూటమిలో ఏ పార్టీకి ఎన్నిసీట్లు వస్తాయన్న విషయం వెల్లడికాలేదు. అయినప్పటికీ టికెట్‌ ఆశిస్తున్న అభ్యర్థులు ప్రచారం మొదలుపెట్టారు. స్థానాలు ఖరారైతే వీరి ప్రచారం మరింత విస్తృతం కానుంది. ఈ పార్టీలు తమ సమావేశాల్ని లైవ్‌ ద్వారా అందిస్తున్నాయి. వాట్సాప్‌ను విపరీతంగా వినియోగిస్తున్నాయి.

కాంగ్రెస్‌

ఓటడిగే తీరు వేరయా అధికారికంగా అభ్యర్థులను ప్రకటించలేదు. టికెట్‌ వస్తుందన్న నమ్మకంతో నాయకులు సామాజిక మాధ్యమంలో ప్రచారం ప్రారంభించారు. రాహల్‌గాంధీ ప్రచారం, కాంగ్రెస్‌ నాయకుల హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. గ్రామ స్థాయిలోనూ ప్రత్యేక గ్రూపులను ఏర్పాటు చేస్తున్నారు.

ఎంఐఎంఓటడిగే తీరు వేరయా 

సామాజిక మీడియాను ప్రచార అస్త్రంగా వినియోగించుకునే ప్రధాన పార్టీగా పేరొందింది. ఎమ్మెల్యేలు పాల్గొన్న ప్రతి కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు పోస్ట్‌ చేస్తున్నారు. సామాజిక మీడియాను ఒవైసీ కుటుంబ సభ్యులు, బంధువులు పర్యవేక్షిస్తున్నారు.

భాజపా

ఓటడిగే తీరు వేరయా భాజపాలోని కొందరు కీలక నాయకులు ఫేస్‌బుక్‌, ట్విటర్‌లో చురుగ్గా ఉంటున్నారు.

సీపీఎంఓటడిగే తీరు వేరయా 

సీపీఎం నేతలు వాట్సాప్‌ను విపరీతంగా వినియోగిస్తూ ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు.

ఓటడిగే తీరు వేరయా  
ట్విటర్‌, ఫేస్‌బుక్‌లలో నేతల జోరు 
ఓటడిగే తీరు వేరయా ఓటడిగే తీరు వేరయా 

కేటీఆర్‌, హరీశ్‌రావు: తాము పాల్గొన్న కార్యక్రమాల ఫొటోలు, శుభాకాంక్షలు, ప్రెస్‌మీట్‌ వీడియోలు, తెరాసకు అనుకూలంగా ఎవరైనా ప్రజలు మాట్లాడితే ఆ వీడియోలను ఉంచుతున్నారు. కొన్ని సందర్భాల్లో ట్విటర్‌లో తమ దృష్టికి వచ్చిన అంశాలకు సంబంధించి అధికారులకు సూచనలు చేస్తున్నారు. ప్రత్యర్థుల విమర్శలనూ తిప్పికొడుతున్నారు. పత్రికల్లో వచ్చిన వార్తలు, ఇంటర్వ్యూల క్లిప్పింగ్‌లు, వివిధ వీడియోలను ఉంచుతున్నారు.పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, డీకే అరుణ, రేవంత్‌రెడ్డి: తాము పాల్గొన్న కార్యక్రమాల ఫొటోలు, శుభాకాంక్షలు, ప్రెస్‌మీట్‌ వీడియోలు.. తెరాస నేతలు, ప్రభుత్వంపై విమర్శలను ఉంచుతున్నారు. తాము అధికారంలోకి వస్తే చేయనున్న పనులకు సంబంధించి హామీలను వెల్లడిస్తున్నారు.

ఓటడిగే తీరు వేరయా ఓటడిగే తీరు వేరయా ఓటడిగే తీరు వేరయా 

ఓటడిగే తీరు వేరయా ఓటడిగే తీరు వేరయా 

భాజపా నేత కిషన్‌రెడ్డి: ప్రధాని మోదీ, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పాల్గొన్న వార్తలు, ఫొటోలను, తన ప్రచారం, పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన అంశాలను ఉంచుతున్నారు.ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌: తన కార్యక్రమాల ఫొటోలు, ప్రెస్‌మీట్లు, వివిధ అంశాలపై అభిప్రాయాలను, పార్టీ వివరాలను వెల్లడిస్తున్నారు. వీరితోపాటు, తెదేపా, తెరాస ఇతర పార్టీల నేతలు మరికొందరు వివిధ అంశాలకు సంబంధించిన ఫొటోలు, ప్రచార చిత్రాలతో పాటు వివిధ అంశాలను ఫేస్‌బుక్‌ లేదా ట్విటర్‌లలో ఉంచుతున్నారు.

వీడియోలకు యూట్యూబ్‌ 
ఓటడిగే తీరు వేరయా 

అభ్యర్థులు తాము చేసిన ప్రచార వీడియోలను యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నారు. ఈ వీడియోలకు మరింత మసాలా జోడించి ఆసక్తిగా మార్చుతున్నారు. ఫేస్‌బుక్‌ లైవ్‌కు ప్రాధాన్యం పెరిగింది. సమావేశ సమయంలో అనుసరించేవారు (ఫాలోవర్లు), విమర్శకులు చేసిన వ్యాఖ్యలు వెంటనే తెలిసిపోతున్నాయి. ఈ మేరకు అభ్యర్థులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొందరు ప్రైవేటు వ్యక్తులు ప్రత్యేక బ్లాగ్‌లు, వెబ్‌సైట్లు తెరిచి అనుకూల, వ్యతిరేకతను మసాలా వార్తలుగా మార్చి ప్రచారం చేస్తున్నారు. వ్యక్తిగత ప్రచార వీడియోల కోసం పెద్ద నాయకులు పేరున్న సంస్థలను సంప్రదిస్తుండగా, మరికొందరు స్థానికంగా సాంకేతిక పరిజ్ఞానంపై పట్టున్న యువత సహాయం తీసుకుంటున్నారు. దీంతో ఎడిటింగ్‌, వీఎఫ్‌ఎక్స్‌పై పట్టున్న వ్యక్తులకు ఎన్నికలు ఆదాయ వనరుగా మారాయి.


గ్రామాల్ని చుట్టొద్దాం 
స్థానిక నేతలతో మంతనాలు 
విస్తృతంగా కరపత్రాల పంపిణీ 
ఈనాడు - హైదరాబాద్‌

మనతోపాటు మన కాలనీ సమస్యలన్నీ మా నాయకుడు తీర్చుతాడు. మనం అంతా కలసికట్టుగా నడవాలి. ఏదున్నా నేను చూసుకుంటా.

-సిరిసిల్ల నియోజకవర్గంలోని ఓ గ్రామంలో గ్రామస్థాయి నాయకుడి భరోసా
ఆసిఫాబాద్‌ నియోజకవర్గంలోని గిరిజన గ్రామాల్లోకి ప్రస్తుతం ఏ పండగ వచ్చినా.. గ్రామాల ఖర్చంతా మాదేనంటున్నారు నాయకులు. తమ శక్తికొలదీ తృణమో పణమో పంచుతున్నారు.

నగరాలు, పట్టణాల్లో ప్రచారం సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా సాగుతుంటే పల్లెల్లో మొత్తం కొత్తపాతల మేళవింపు అన్నట్లుగా జరుగుతోంది. అభ్యర్థులు సామాజిక మీడియాను వినియోగిస్తూనే.. సాంప్రదాయ ప్రచారాన్ని గతానికి భిన్నంగా చేస్తున్నారు. పగలంతా జెండా కర్రలు పట్టుకుని యువకులు, ఆడపడుచులు పల్లెలను చుట్టివస్తున్నారు. పొద్దుపోతే చాలు నాయకుల ఇళ్లలో ఏవేవో మంతనాలు జరుగుతున్నాయి. టికెట్లు దక్కించుకున్న తెరాస అభ్యర్థులు, టికెట్‌ గ్యారంటీ అనుకున్న విపక్ష నాయకులు తమ దృష్టంతా గ్రామాలపైకి మళ్లిస్తున్నారు. ఓట్లను ఏకపక్షంగా కొల్లగొట్టేందుకు ఒక్కొక్కరు ఒక్కోశైలిని అనుసరిస్తున్నారు.

పెట్టుబడి అంతా వారిదే 

గణేష్‌ నవరాత్రులు.. దసరా పండగ అయిపోయినా గ్రామాల్లో మాత్రం ఒక్కరిద్దరు నాయకుల ఇంటివద్ద పరిస్థితి నిత్య కల్యాణాన్ని తలపిస్తోంది. జెండా తోరణాలు, వాహనాల బారులు కనిపిస్తున్నాయి. నాలుగైదు పల్లెలకు కీలకంగా ఉన్న ఊళ్లలోని నాయకులు రెండు వారాలుగా రారాజులుగా వెలిగిపోతున్నారు. అభ్యర్థులు తమ వాణిని వీరి ద్వారా ఓటర్లకు చేరుస్తుండడమే ఇందుకు కారణం. దీంతోపాటు ప్రచార దళాలకు కూడా ఈ నాయకుల ఇళ్లే అడ్డాలుగా మారాయి. గ్రామస్థాయిలో ప్రచారానికి, పల్లెల్లో ఏర్పాట్లకు వ్యయం అంతా అభ్యర్థుల నుంచి ఈ గ్రామ స్థాయి నాయకులకు అందుతుండడంతో ప్రచారం ఉరకలెత్తుతోంది.

మహిళలే అస్త్రశస్త్రాలుగా.. 

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాతోపాటు పలు నియోజకవర్గాల్లో అభ్యర్థులు మహిళామణులను ప్రచారంలో కీలక అస్త్రాలుగా సంధిస్తున్నారు. జడ్చర్ల నియోజకవర్గంలో ఓ పార్టీ ప్రత్యేకంగా మహిళా గ్రూపులను ఏర్పాటుచేయిస్తోంది. ఐకేపీ మహిళా సంఘాల్లో కీలకంగా ఉన్న వారిని ఎంపిక చేసుకుని వారితో బృందాలు ఏర్పాటు చేయిస్తోంది. తెరచాటుగా ప్రచారం నిర్వహించి మహిళల ఓట్లను కొల్లగొట్టడమే లక్ష్యంగా ఈ వ్యవహారమంతా రహస్యంగా సాగిపోతోంది. ఖమ్మం, వరంగల్‌ జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఇదే మార్గాన్ని అనుసరిస్తున్నారు.

గ్రామ కరపత్రం

గ్రామానికి తామేం చేశామో చెప్పేందుకు కొందరు అభ్యర్థులు గ్రామాల వారీగా  కరపత్రాలు ముద్రించి పంచుతున్నారు. ఆసరా పింఛన్ల నుంచి శ్మశానవాటిక అభివృద్ధి వరకు చేసిన పనులు, మంజూరీ వివరాలను కరపత్రంలో పేర్కొంటున్నారు. దీనికి పోటీగా రాబోయే రోజుల్లో ఏంచేస్తామన్నది ప్రత్యర్థులు ప్రచారం చేస్తున్నారు. మరోవైపు కొందరు అభ్యర్థులకు మండల స్థాయిల్లో కొందరు ప్రచార వ్యయాన్ని భరిస్తుండడం ప్రత్యర్థులను కలవరపెడుతోంది. ఎన్నికల పుణ్యమా అని గ్రామాల్లో కీలకంగా వ్యవహరించే వ్యక్తులకు పార్టీలు పెద్దపీట వేస్తున్నాయి. వారి ద్వారానే ఆయా వర్గాల ప్రజలను తమవైపునకు తిప్పుకోవచ్చన్న వ్యూహాన్ని రచిస్తున్నాయి. ప్రధానంగా గ్రామపెద్ద మాటకు కట్టుబడి ఉండే గిరిజన ప్రాంతాల్లో ఈ తరహా ఎత్తుగడలను అభ్యర్థులు అనుసరిస్తున్నారు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.