close

ప్ర‌త్యేక క‌థ‌నం

100 కోట్ల ఫోన్ల తయారీ 

సాంకేతిక రంగంలో నూతన ఆవిష్కరణలకు ప్రోత్సాహం 
సైబర్‌ భద్రత ఉపకరణాల తయారీకి ప్రాధాన్యం 
విదేశీ సంస్థల్లో పరిశోధనలకు విద్యార్థులకు అవకాశం 
జాతీయ ఎలక్ట్రానిక్స్‌ ముసాయిదా-2018 విడుదల 
ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం 
100 కోట్ల ఫోన్ల తయారీ 

లక్ట్రానిక్స్‌  అభివృద్ధి, పరిశోధన, తయారీకి మరింత ప్రోత్సాహం కల్పించేలా కేంద్రం నూతన ఎలక్ట్రానిక్స్‌ విధాన ముసాయిదా-2018ను ప్రకటించింది. 2025 నాటికి దేశీయంగా 100 కోట్ల మొబైల్‌ ఫోన్లు తయారు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. కీలకమైన సైబర్‌ భద్రతలో సవాళ్లను అధిగమించేందుకు అవసరమైన ఉత్పత్తుల తయారీతోపాటు.. ప్రభుత్వ రంగంలో సైబర్‌ భద్రత పరీక్షలు, మదింపు సదుపాయాలు కల్పించనుంది. రక్షణ, వ్యవసాయ, ఆరోగ్య, స్మార్ట్‌ సిటీలు, ఆటోమేషన్‌ రంగాల్లో కొత్త సాంకేతిక రంగాలైనా 5జీ, కృత్రిమ మేధ, మిషన్‌ లెర్నింగ్‌ను వినియోగిస్తూ సమస్యలను పరిష్కరించే అంకుర సంస్థలను మరింత ప్రోత్సహించనుంది. యువతకు ‘నైపుణ్య శిక్షణ’ కల్పిస్తూనే, విదేశీ యూనివర్సిటీల్లో పరిశోధనలు చేసేందుకు వీలు కల్పించనుంది. 
ఈ మేరకు ముసాయిదా విధానంపై ప్రజలు, వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు తీసుకోవాలని నిర్ణయించింది.

2025 నాటికి ఇవీ లక్ష్యాలు

తయారయ్యే మొబైల్‌ ఫోన్ల విలువరూ.13 లక్షల కోట్లు 
ఎగుమతులు 60 కోట్ల స్మార్ట్‌ ఫోన్లు 
విలువ రూ.7 లక్షల కోట్లు

ప్రధాన లక్ష్యాలివీ...

ఎలక్ట్రానిక్స్‌ రంగం అభివృద్ధి, నూతన నమూనాల తయారీలో అగ్రస్థానం 
100 కోట్ల ఫోన్ల తయారీ విదేశాలకు ఎగుమతి చేయడం 
రాష్ట్రాల్లో ఎలక్ట్రానిక్స్‌ తయారీ కేంద్రాలకు అవసరమైన ప్రోత్సాహకాలు 
విదేశాల నుంచి వస్తువులు ఏకమొత్తంగా దిగుమతి కాకుండా నియంత్రించడం 
దేశీయ, విదేశీ విపణులకు అనుగుణంగా ఉత్పత్తుల అభివృద్ధికి పరిశోధనలు 
నూతన సాంకేతిక రంగాల్లో పరిశోధనలు, వివిధ సమస్యల పరిష్కారానికి మార్గాల  అన్వేషణ

యువతకు నైపుణ్య శిక్షణ...

100 కోట్ల ఫోన్ల తయారీ ప్రస్తుతం కొత్త పుంతలు తొక్కుతున్న సాంకేతిక రంగాలైన 5జీ, ఐవోటీ, సెన్సార్స్‌, డ్రోన్స్‌, కృత్రిమ మేధ(ఏఐ), మిషన్‌ లెర్నింగ్‌, ఏఆర్‌, వీఆర్‌, త్రీడీ ప్రింటింగ్‌, గేమింట్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగాల్లో యువతకు అవసరమైన నైపుణ్య శిక్షణ ఇప్పించనుంది. 
విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థల్లోని విద్యార్థులు, అధ్యాపకులకు వైద్య, రక్షణ, ఆటోమేటివ్‌, వ్యూహాత్మక, పవర్‌ ఎలక్ట్రానిక్స్‌, ఆటోమేషన్‌ రంగాల్లో పరిశోధనలకు అవసరమైన సహాయం అందిస్తుంది. 
పరిశోధన విద్యార్థులు విదేశీ వర్సిటీల్లో ఆరు నెలల నుంచి ఏడాది పాటు పరిశోధనలు నిర్వహించేందుకు సహాయం చేస్తుంది. (ఆయా విద్యార్థులు కచ్చితంగా భారత్‌లో ఐదేళ్ల పాటు పనిచేయాలన్న షరతు అంగీకరించాలి.) 
ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఐటీ, కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు అదనంగా చిన్న నగరాల్లోనూ ఎలక్ట్రానిక్స్‌ పరిశోధన కేంద్రాలు, సీవోఈ, ఇంక్యుబేషన్‌ కేంద్రాల ఏర్పాటును ప్రోత్సహిస్తుంది.
- ఈనాడు, హైదరాబాద్‌

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999 - 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions | Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.