close

ప్ర‌త్యేక క‌థ‌నం

40 వసంతాల వెలుగు దివ్వెలు 

సంస్కరణలతో ఆర్థిక అద్భుతాలు సాధించిన చైనా

1978 - 2018 

40 వసంతాల వెలుగు దివ్వెలు 

1978 నుంచి 2018 వరకు చైనాలో దారిద్య్రం నుంచి బయటపడిన వారు 74 కోట్ల మంది సరిగ్గా 40 ఏళ్ల కిందటి మాట. దేశంలోని 96 కోట్ల మందికి సంతృప్తిగా తిండిపెట్టలేని దుర్భర స్థితి చైనాది. నేడు దేశంలోని దాదాపు 142 కోట్ల మంది సౌకర్యవంతమైన జీవనం గడిపే ఆర్థిక పరిస్థితులు ఈ దేశంలో ఉన్నాయి. సంప్రదాయ, పిడివాద విధానాలను పక్కనబెట్టి.. పురోగమన ఆర్థిక విధానాల జూలు విదిల్చిన ఘన చరిత్ర కమ్యూనిస్టు చైనాది. తత్ఫలితమే చైనా నేడు ప్రపంచంలో ఓ ప్రబల ఆర్థిక శక్తి. అమెరికా తర్వాత రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) ప్రస్తుతం 12.24 లక్షల కోట్ల డాలర్లు! తలసరి ఆదాయం 8,827 డాలర్లు. ఇంతటి ఆర్థిక అద్భుతాలు ఈ 40 ఏళ్లలో ఎలా సాధ్యమయ్యాయి? మిరిమిట్లు గొలిపే దేశ ఆర్థిక వ్యవస్థకు కారణాలేమిటి? తరచి చూస్తే.. కమ్యూనిస్టు పాలకులు దేశంలో అమలు చేసిన ఆర్థిక సంస్కరణలే దీనికి ప్రధాన కారణం.

19వ శతాబ్దం చివర్లో, 20వ శతాబ్దం ఆరంభంలో చైనా ఎన్నో ఆర్థిక ఒడిదుడుకుల్ని ఎదుర్కొంది. మావో ప్రయోగాలు గ్రేట్‌లీప్‌, సాంస్కృతిక విప్లవం చైనా ఆర్థిక వ్యవస్థను మరిన్ని ఒడిదుడుకులకు గురిచేశాయి. అయితే 1950ల తరువాత వ్యవసాయం, ఆరోగ్యం తదితర రంగాల్లో చైనా ముందడుగు వేయడం ప్రారంభించింది. చైనా ఉక్కు మనిషి డెంగ్‌ జియవోపింగ్‌ దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించడానికి 1978 డిసెంబరులో దేశంలో ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు.  నాటి నుంచి నేటి వరకు ఈ 40 ఏళ్లలో చైనా పాలకులు చూపిన దార్శనికత, తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు, చేపట్టిన సంస్కరణలు, అవలంబించిన అధునాతన పద్ధతులు.. నేడు చైనాను ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టాయి.  వివిధ రంగాల్లో చైనా సాధిస్తున్న అద్భుత విజయాల్ని చూసి ప్రపంచమే ‘ఔరా’! అంటూ ముక్కున వేలేసుకుంటోంది. బీజింగ్‌లోని ‘గ్రేట్‌ హాల్‌ ఆఫ్‌ పీపుల్‌’లో జరిగిన కార్యక్రమంలో అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌ మాట్లాడుతూ చైనా ఆర్థిక విజయాల్ని ఏకరవు పెట్టారు. 
చైనా చేపట్టిన ఆర్థిక సంస్కరణల ప్రభావం తీరు తెన్నుల్ని ఒకసారి విశ్లేషిస్తే..

40 వసంతాల వెలుగు దివ్వెలు 

దశలు దశలుగా.. 
1978లో ప్రారంభమైన ఆర్థిక సంస్కరణలు రెండు దశలుగా అమలయ్యాయి. 
* మొదటి దశ: 1978 నుంచి 1984 దాకా మొదటి దశ అమలైంది.  ఉమ్మడి వ్యవసాయానికి స్వస్తి పలికి... సాగు రంగంలో సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. దేశ ఆర్థిక వ్యవస్థను విదేశీ పెట్టుబడులకు బార్లా తెరిచారు. వ్యాపారులు పరిశ్రమలు ప్రారంభించడానికి, అంతర్జాతీయ వాణిజ్యానికి అనుమతించారు. అయితే చాలావరకు పరిశ్రమలన్నీ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే పనిచేసేవి.

* రెండో దశ: 1984-1993 మధ్య ఈ దశ అమలైంది. ప్రైవేటీకరణను అనుమతించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని పరిశ్రమల్ని కాంట్రాక్టుకు కివ్వడం మొదలుపెట్టారు. ధరలపై నియంత్రణలు, రక్షణాత్మక విధానాలు, నిబంధనలపై ఆంక్షలు ఎత్తేశారు. బ్యాంకులు, పెట్రోలియం లాంటి రంగాలపై మాత్రం ప్రభుత్వ గుత్తాధిపత్యమే కొనసాగింది. ప్రైవేటు రంగం గణనీయంగా వృద్ధి చెందింది. 2005 నాటికి దేశ జీడీపీలో దాని వాటా 70 శాతానికి చేరుకుంది. 1993 నుంచి 2005 దాకా కొనసాగిన సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థను నవ్య పథంలోకి తీసుకువెళ్లాయి. 
2013దాకా దేశ ఆర్థిక వ్యవస్థ ఏటా 9.5 శాతం మేర వృద్ధిని నమోదుచేసింది. దారిద్య్రం చాలావరకు తుడిచిపెట్టుకు పోయింది. అదే సమయంలో ప్రజల ఆర్థిక అసమానతలూ పెరిగాయి.

40 వసంతాల వెలుగు దివ్వెలు 

- ఈనాడు ప్ర‌త్యేక విభాగం

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.