close

ప్ర‌త్యేక క‌థ‌నం

త్రివిధ దళాలకు దూరంగా తెలుగు యువత   

కొలువుల ప్రవేశాల్లో ఏపీ, తెలంగాణ వెనుకబాటు 
దక్షిణాది రాష్ట్రాలతో పోల్చుకున్నా తక్కువే 
యూపీ, రాజస్థాన్‌, పంజాబ్‌, హరియాణా రాష్ట్రాలదే అధిక వాటా 
ఈనాడు - హైదరాబాద్‌

త్రివిధ దళాలకు దూరంగా తెలుగు యువత   

దేశ రక్షణలో కీలకపాత్ర వహించే త్రివిధ (సైన్యం, నావికాదళం, వాయుసేన) దళాల ప్రవేశాల్లో తెలుగు రాష్ట్రాల యువత వెనకబడుతోంది. ఉత్తరాది రాష్ట్రాలతోనే కాదు.. దక్షిణాదిన కర్ణాటక, తమిళనాడు, కేరళతో పోల్చుకున్నా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు వెనకబడటం గమనార్హం. ఏపీతో పోలిస్తే తెలంగాణ నుంచి రక్షణ దళాల్లోకి ఎంపికవుతున్న వారి సంఖ్య ఇంకా తక్కువ. త్రివిధ దళాల్లో ప్రవేశాల విషయంలో ఉత్తర ప్రదేశ్‌ అగ్రస్థానంలో నిలుస్తోంది.

అపోహలు.. అవగాహన లేమి..

తెలుగు రాష్ట్రాల్లో కొన్ని కోర్సులు, కొన్ని ఉద్యోగాల వైపే ఎక్కువగా విద్యార్థులు, తల్లిదండ్రులు దృష్టి పెడుతున్నారు. త్రివిధ దళాల్లో కొలువుల్లో చేరితే ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు ఉండవనే అపోహ తెలుగు రాష్ట్రాల్లో యువతను ఆ వైపు వెళ్లనివ్వడం లేదని నిపుణులు చెబుతున్నారు. తెలుగువారి ఎంపిక తక్కువగా ఉండటానికి ఇదీ ఒక కారణమంటున్నారు. ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు ఉండేవాటినే ఇక్కడ ప్రభుత్వ కొలువులుగా చూస్తుంటారని వ్యాఖ్యానిస్తున్నారు. అవగాహన లేకపోవడంతోపాటు రక్షణ దళాల్లో ఉద్యోగమంటే సరిహద్దుల్లో నిత్యం యుద్ధం చేస్తుండాలనే అపోహలూ వెనుకబాటుకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు సర్కారు ఉద్యోగమైతే చాలన్నట్లు ఉత్తరాది యువకులు భారీగా పోటీపడుతూ అధిక సంఖ్యలో ఎంపికవుతున్నారు. సముద్ర తీరం ఉన్న ఏపీ నుంచి నేవీకి తక్కువ సంఖ్యలో ఎంపికవుతున్నారు. గత రెండుమూడు దశాబ్దాలుగా పరిశీలిస్తే తెలుగు రాష్ట్రాల్లో శిక్షణ (కోచింగ్‌) ఉన్న కోర్సులకు, ఉద్యోగాలకే ఎక్కువమంది విద్యార్థులు, యువత ఆసక్తి చూపుతున్నారని విశ్లేషిస్తున్నారు. అందుకు జేఈఈ, ఎంసెట్‌, సాఫ్ట్‌వేర్‌, సివిల్స్‌ తదితర పరీక్షలను ఉదాహరణగా చెప్పుకోవచ్చని, రక్షణ దళాలకు సంబంధించి అవగాహన పెంచేందుకు కోచింగ్‌ సంస్థలు పెరగాల్సి ఉందని చెబుతున్నారు. ఐఐటీలు, మెడికల్‌ తరహాలో ఇంటర్‌ తర్వాతే నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ (ఎన్‌డీఏ) తదితర సంస్థలపై దృష్టి పెడితే ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని, వారికి కల్పించే సౌకర్యాలు ఐఏఎస్‌ అధికారులకు కూడా ఉండవని స్పష్టంచేస్తున్నారు. రక్షణ దళాల్లో ఖాళీలను యూపీఎస్‌సీ, స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌తోపాటు ఆయా విభాగాలు సొంతగానూ భర్తీ చేస్తుంటాయి.

త్రివిధ దళాలకు దూరంగా తెలుగు యువత   

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.