close

ప్ర‌త్యేక క‌థ‌నం

రోజంతా ఏం చేస్తున్నారు?

దేశంలో తొలిసారి కాల వినియోగ సర్వే
రైతుల ఆదాయ వ్యయాలపై కూడా..
గణాంకశాఖ ఆధ్వర్యంలో జనవరి 1 నుంచి ప్రారంభం

రోజంతా ఏం చేస్తున్నారు?

ఈనాడు, అమరావతి: క్షణం తీరక లేదు.. దమ్మిడీ ఆదాయం లేదు అనే మాట వింటుంటాం. ప్రభుత్వం కూడా దీనిపై దృష్టి పెట్టింది. దేశంలో వ్యక్తుల రోజువారీ సమయ వినియోగం ఎలా ఉందనే విషయంపై సర్వే చేయబోతోంది. వ్యవసాయ కుటుంబాల నెలవారీ ఆదాయం? వారికున్న ఆస్తులు, అప్పులు తదితర అంశాలపైనా సర్వే నిర్వహించనుంది. దేశవ్యాప్తంగా వచ్చే జనవరి 1 నుంచి ఈ రెండు రకాల సర్వేల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సర్వే సిబ్బందికి 5 రోజుల శిక్షణ తరగతులు విజయవాడలో మంగళవారం ప్రారంభమయ్యాయి.

ఇంటి పనికి ఎంత సమయం?
ఒక వ్యక్తి రోజులో ఏ పనులకు ఎంత సమయం వెచ్చిస్తున్నారనేది పరిశీలించేందుకు ‘టైమ్‌ యూజ్‌’ సర్వే నిర్వహిస్తున్నారు. ఇందులో మొత్తం 150 అంశాలు ఉంటాయి.

* రోజులో 24 గంటలను 48 భాగాలు (స్పెల్‌్్స)గా తీసుకుని ప్రతి అర గంటలో ఏం చేస్తారనే సమాచారం తీసుకుంటారు. వీటిని చెల్లింపు (ఆదాయాన్నిచ్చే ఉద్యోగం, ఇతర రకాల పనులు), చెల్లింపేతర (ఇంటి పని, స్వచ్ఛంద సేవలు) పనులుగా విభజిస్తారు. రోజులో ఎంత సమయం ప్రయాణిస్తుంటారనే వివరాలూ తీసుకుంటారు.

* ఇంటి పని, కుటుంబ సభ్యులతో గడపడం, ఉత్పాదక కార్యకలాపాలకు ఎంత సమయం కేటాయిస్తున్నారనే వివరాలను కుటుంబ సభ్యుల వారీగా సేకరిస్తారు.
* మహిళలు ఇంటి పనికి ఎంత సమయం వెచ్చిస్తున్నారు.. వ్యక్తిగత, ఆరోగ్య అంశాలకు ఎన్ని గంటలు కేటాయిస్తున్నారు..ఎంతసేపు విరామం తీసుకుంటున్నారనే వివరాలూ సేకరిస్తారు.
* ఎలాంటి చెల్లింపులు లేకుండా చేసే పనులు దేశ ఆర్థిక వ్యవస్థ ఎదుగుదలకు ఎలా దోహదపడుతున్నాయనే అంశాలను గణిస్తారు.

రైతుల అప్పులెంత? ఆదాయమెంత?
వ్యవసాయం, రైతుల ఆర్థిక పరిస్థితిపై మరో సర్వే జరగనుంది. ఇందులో సుమారు 370 అంశాలపై సమాచారం సేకరిస్తారు.
* రైతుకు ఉన్న పొలమెంత? అందులో ఎంత విస్తీర్ణంలో పండిస్తున్నారు? నీటి వసతి ఉన్న భూమి ఎంత? తదితర వివరాలు సేకరిస్తారు.
* పంటల సాగులో వినియోగించే విధానాలు, ఆధునిక సాంకేతికత, పంటల సాగుకు తెచ్చే అప్పులు, ఆదాయం, పంట ఉత్పత్తి, మార్కెట్‌ స్థితిగతులను నమోదు చేస్తారు.గేదెలు, ఆవులు, మేకలు, కోళ్లు వంటి ద్వారా వచ్చే ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుంటారు.
* 2019 డిసెంబరు 31 వరకూ జరిగే ఈ సర్వే వివరాలను 2020లో వెల్లడిస్తారు.

మొదటిసారి కాల వినియోగ సర్వే: టైమ్‌ యూజ్‌ సర్వేను దేశంలో మొదటిసారి చేస్తున్నాం. దీని ద్వారా మనం రోజులో దేనికెంత సమయం కేటాయిస్తున్నామనే వివరాలు తెలుస్తాయి. కర్షకుల ఆర్థిక స్థితిగతులు తెలుసుకోవడంతో పాటు రుణమాఫీ సమయంలోనూ వినియోగించుకునేలా రైతు కుటుంబాల సర్వే ఉపయోగపడుతుంది.

- ఆర్‌.కిరణ్‌కుమార్‌, డిప్యూటీ డైరెక్టర్‌, గణాంకశాఖ

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.