Latest Telugu News, Headlines - EENADU
close

ప్ర‌త్యేక క‌థ‌నం

తుక్కు..తక్కువేం కాదు!

సరైన పద్ధతిలో వినియోగించుకుంటే 10 లక్షల మందికి ఉపాధి
విలువైన సహజ వనరుల్ని పరిరక్షించుకోవచ్చు
ఉక్కు తయారీ వ్యయాలూ ఆదా
ప్రత్యేక సమీకరణ విధానం అవసరం
పునర్వినియోగ ప్రక్రియలన్నిటినీ కలిపి పరిశ్రమగా గుర్తించాలి
నీతి ఆయోగ్‌ నివేదిక వెల్లడి

తుక్కు..తక్కువేం కాదు!

వివిధ పరిశ్రమల్లో ఉత్పత్తుల తయారీ అనంతరం వెలువడే ఉక్కు తుక్కును నిర్లక్ష్యం చేయవద్దని, సక్రమ పద్ధతిలో దానిని వినియోగించుకుంటే దేశంలో 10 లక్షల మందికి ఉపాధి కల్పించవచ్చని నీతిఆయోగ్‌ అభిప్రాయపడింది. అంతేకాకుండా ఉక్కు తయారీ కోసం వినియోగించే విలువైన ముడిఖనిజం వంటి సహజ వనరులనూ కాపాడుకోవచ్చని సూచించింది. తుక్కు పునర్వినియోగం(రీసైక్లింగ్‌)ను ఒక పరిశ్రమగా గుర్తించాల్సిన అవసరం ఉందనీ ‘ఉక్కు తయారీలో వనరుల వియోగం, తుక్కు పునర్వినియోగం’పై విడుదల చేసిన నివేదికలో నీతిఆయోగ్‌ వెల్లడించింది.

తుక్కు..తక్కువేం కాదు!

ప్రత్యేక పరిశ్రమగా గుర్తించాలి

రోజు రోజుకీ పెరుగుతున్న ఉక్కు అవసరాలను తీర్చటం కోసం సహజ వనరుల వినియోగం అధికమవుతోంది. పరిమితంగా ఉన్న వనరులను కాపాడుకుంటూనే ప్రజల అవసరాలు తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. పరిశ్రమలు, గృహాలు, కాలం చెల్లిన వాహనాలు తదితరాల ద్వారా వచ్చే తుక్కును సమగ్రంగా పునర్వినియోగిస్తూ ఉక్కును తయారీ చేసే చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ప్రోత్సహించాల్సి ఉందని నీతిఆయోగ్‌ అభిప్రాయపడింది. దీనికోసం తుక్కు సేకరణ, సమీకరణ, ముక్కలుగా విభజించడం, ప్రాసెసింగ్‌, ఉక్కు తయారీ సంస్థలకు తుక్కు రవాణా తదితరాలన్నిటినీ ఓ ప్రత్యేక వ్యవస్థలోకి తీసుకురావాలని, ఈ వ్యవస్థను పరిశ్రమగా గుర్తించాల్సిన అవసరముందనీ పేర్కొంది. తుక్కు సేకరణ, సరఫరాలో ప్రస్తుతం పలు అవరోధాలున్నాయని తెలిపింది. రానున్న 20 ఏళ్ల డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ఒక ప్రత్యేక విధానం అవసరమని ప్రభుత్వానికి తెలిపింది. తుక్కును పూర్తిస్థాయిలో పునర్వినియోగించే క్రమంలో  నూతన సాంకేతికతతో చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ఏర్పాటు చేసి వచ్చే పదేళ్లలో కనీసం 10లక్షల మందికి అదనంగా ఉద్యోగాలు కల్పించే అవకాశాలున్నాయని పేర్కొంది.

సేకరణ కర్తలు, సంస్థలకు మధ్య సమన్వయం అవసరం

తుక్కు ద్వారా ప్రతియేటా రూ.2వేల కోట్ల ఆదాయం ఆర్జించవచ్చు. పదిలక్షల టన్నుల తుక్కును తిరిగి వినియోగించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా 2017 నాటికి 775 మిలియన్‌ టన్నుల తుక్కు అందుబాటులో ఉంది. ఇందులో 630 మిలియన్‌ టన్నులను తిరిగి వినియోగిస్తున్నారు. 2030 నాటికి బిలియన్‌ టన్నుల తుక్కు అందుబాటులోకి వస్తుంది. ఇది ఎంతో విలువైన వనరు. తుక్కు సేకరించే వారికి, సంస్థలకు మధ్య సమన్వయం నెలకొల్పాలి. ఈ మేరకు మానవ వనరులకు శిక్షణ ఇవ్వాలి. 15-20 ఏళ్ల కాలపరిమితి దాటిన వాహనాలను తుక్కు కిందకు తీసుకువచ్చే ప్రత్యేక విధానం ఉండాలి. వాహనాలకు కనీస కాలపరిమితి విధానం కచ్చితంగా అమలు చేస్తే రానున్న ఐదేళ్లలో 20-25 మిలియన్‌ టన్నుల అదనపు తుక్కు అందుబాటులోకి వస్తుందని నీతిఆయోగ్‌ అంచనా వేసింది. సేకరించిన తుక్కును వేరు చేసి ముక్కలుగా చేసే పరిశ్రమలు, రీసైక్లింగ్‌ ప్లాంట్లు రావాలి. ఇప్పటికే రెండు ప్రైవేటు సంస్థల ద్వారా దేశంలోనే తొలిసారిగా 1.2 లక్షల టన్నుల సామర్థ్యం కలిగిన వాహనాల తుక్కు వినియోగ కేంద్రం ఏర్పాటయ్యింది. ఉక్కు తయారీ సమయంలో మిగిలిపోయే వ్యర్థాలను రహదారులు, భవన నిర్మాణ సామగ్రి తయారీలో, ఎరువులుగా మార్చేందుకు వీలుందని నీతిఆయోగ్‌ విశ్లేషించింది.

తుక్కు..తక్కువేం కాదు!

తుక్కు..తక్కువేం కాదు!

-ఈనాడు, హైద‌రాబాద్‌

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.