close

ప్ర‌త్యేక క‌థ‌నం

రైతుల ఆదాయం రెట్టింపు చేద్దాం

సాగులో మార్పులు తీసుకురండి
పండిన పంటలకు   మార్కెటింగ్‌ సౌకర్యాల కల్పన
  రాష్ట్ర వ్యవసాయశాఖకు కేంద్రం సూచన
  రాష్ట్రస్థాయి టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సమావేశానికి సన్నాహాలు

రైతుల ఆదాయం రెట్టింపు చేద్దాం

రైతుల ఆదాయం రెట్టింపు చేయడానికి పక్కా కార్యాచరణతో పనులు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యవసాయశాఖను తాజాగా ఆదేశించింది. దేశంలో ప్రతీ రైతు ఆదాయాన్ని 2022కల్లా రెట్టింపు చేయడానికి కేంద్రం అనేక కార్యక్రమాలు ప్రారంభించింది. వీటిలో తెలంగాణకు అనుకూలంగా ఉన్నవాటిని, రాష్ట్ర వాతావరణ పరిస్థితులు, అన్నదాతల అవసరాలను బట్టి సొంత కార్యక్రమాలు రూపొందించి అమలుచేయాలని  సూచించింది.

కేంద్రం సూచనలు...

రైతుల ఆదాయం రెట్టింపు చేద్దాం

* ప్రతీ పంటకు అనుకూలమైన వాతావరణ ప్రాంతాల్లో పంటలకాలనీలు ఏర్పాటుచేయాలి. డిమాండ్‌ ఉండే పంటల సాగుకు రైతులను ప్రోత్సహించాలి. కేవలం ఒక పంట సాగు విధానం వద్దు. వరి సాగుచేసిన పొలంలో పప్పుధాన్యాలు లేదా కూరగాయలు వంటివి రెండో పంటగా వేయాలి. ఒక పైరులో అంతరపంటగా మరో పంటను తప్పనిసరిగా వేయాలి. మిశ్రమ సేద్య విధానం రైతులకు లాభసాటిగా ఉంటుంది.

రైతుల ఆదాయం రెట్టింపు చేద్దాం

* పంటకాలం ప్రారంభమైన వెంటనే నాణ్యమైన విత్తనాలు, ఎరువులను రైతులకు అందుబాటులో ఉంచాలి.

రైతుల ఆదాయం రెట్టింపు చేద్దాం

* కరవు, విపత్తుల తాకిడి ఉన్న ప్రాంతాల్లో స్వల్పకాలిక వంగడాలను సాగుచేసేలా చూడాలి.

రైతుల ఆదాయం రెట్టింపు చేద్దాం

* పండ్లు, కూరగాయలు, సుగంధ ద్రవ్యాలకు డిమాండ్‌ బాగా పెరుగుతోంది. తెలంగాణలో వీటి సాగుకు మంచి వాతావరణం ఉంది. వీటికి జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో మంచి ధర ఏడాది పొడవునా ఉంటోంది. వీటి సాగుకు రైతులను ప్రోత్సహించాలి.

రైతుల ఆదాయం రెట్టింపు చేద్దాం

* రైతు పండించే పంటకు మద్దతు ధర ఇప్పించేలా మార్కెటింగ్‌ సదుపాయాలు పెంచాలి. గోదాముల్లో నిల్వ సదుపాయం కల్పించాలి.

రైతుల ఆదాయం రెట్టింపు చేద్దాం

* ప్రతీ రైతుకు పంటసాగుతో పాటు పాడి పశువులు లేదా నీటి వనరులున్న ప్రాంతాల్లో చేపల పెంపకం వంటి అనుబంధ కార్యక్రమాల ద్వారా అదనపు ఆదాయం వచ్చేలా చూడాలి.

రైతుల ఆదాయం రెట్టింపు చేద్దాం

* ఒక్కో గ్రామంలో ఒకే పంట పండించే రైతులతో ‘వ్యవసాయోత్పత్తుల కంపెనీ’(ఎఫ్‌పీఓ) ఏర్పాటుచేయించాలి. వారు పండించిన పంటలను ఈ కంపెనీ తరఫున శుద్ధి చేసి డిమాండ్‌ ఉన్న ప్రాంతాలకు తీసుకెళ్లి అమ్ముకునేలా మౌలిక సదుపాయాలు కల్పించాలి.

రైతుల ఆదాయం రెట్టింపు చేద్దాం

* తెలంగాణలో విత్తన పంటల సాగుకు, విత్తనోత్పత్తి పెంపునకు అనుకూల వాతావరణం ఉంది. దేశానికే కాకుండా విదేశాలకు సైతం ఎగుమతి చేసే స్థాయిలో విత్తన పంటల సాగును ఈ రాష్ట్రంలో ప్రోత్సహించాలి.

కమిటీ సమావేశంలో చర్చిస్తాం
- రాహుల్‌ బొజ్జా, వ్యవసాయ కమిషనర్‌, తెలంగాణ

అన్నదాతల ఆదాయం రెట్టింపు చేయడానికి కేంద్రం ఇటీవల దిల్లీలో ఏర్పాటుచేసిన సమావేశానికి రాష్ట్రం తరఫున హాజరయ్యా. అన్ని రాష్ట్రాలకు సంయుక్తంగా కొన్ని సూచనలిచ్చినా, ఏ రాష్ట్ర అవసరాలకు అనుకూలంగా వాటిని అమలుచేసుకునేలా వీలు కల్పించారు. ఇందుకోసం రాష్ట్రస్థాయిలో ఏర్పాటుచేసిన టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సమావేశం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. వాస్తవానికి సోమవారమే దీనిని ఏర్పాటుచేయాలి. అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. రాష్ట్ర రైతుల ఆదాయం పెంచడానికి ఈ కమిటీలో చర్చించి ప్రణాళిక సిద్ధం చేస్తాం. రైతుబంధు పథకం కింద సీజన్‌కు ముందు ఇస్తున్న సాయంతో విత్తనాలు, ఎరువులు రైతులు కొనే అవకాశం ఏర్పడింది. పంట సాగుకు పెట్టుబడి సాయంతో పాటు వ్యవసాయాధికారుల ద్వారా సాంకేతిక సలహాలు అందించి దిగుబడి పెంచేందుకు చర్యలు తీసుకుంటాం.
- ఈనాడు, హైదరాబాద్‌

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.